Share News

వీరభద్రాలయంలో ఘనంగా రాహుకాల పూజలు

ABN , Publish Date - Aug 02 , 2025 | 12:42 AM

రాయచోటి పట్టణంలోని భద్రకాళీ సమేత వీరభద్రాలయంలో శుక్రవారం రాహుకాల పూజలను ఘనంగా నిర్వహించారు.

వీరభద్రాలయంలో ఘనంగా రాహుకాల పూజలు
రాహుకాల పూజలు నిర్వహిస్తున్న భక్తులు

రాయచోటిటౌన, ఆగస్టు1(ఆంధ్రజ్యోతి): రాయచోటి పట్టణంలోని భద్రకాళీ సమేత వీరభద్రాలయంలో శుక్రవారం రాహుకాల పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు శంకరయ్య, కృ ష్ణయ్య స్వాముల వేదమంత్రాల మధ్య భద్రకాళీ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి వివిధ రకాల పుష్పాలు, పట్టువస్త్రాలతో సర్వాంగ సుదరంగా అలంకరించి భక్తిశ్రద్ధలతో రాహుకాల పూజలను నిర్వహించారు. ఆల య అర్చకుడు శంకరయ్యస్వామి రాహుకాల పూజల విశిష్టత గురించి మ హిళా భక్తులకు వివరించి తీర్థప్రసాదాలు అందజేశారు.

Updated Date - Aug 02 , 2025 | 12:43 AM