Share News

ప్రభుత్వ టీచర్లతో సమానంగా పదోన్నతులు కల్పించాలి

ABN , Publish Date - Aug 02 , 2025 | 12:41 AM

పాఠశాల విద్యాశాఖ అజమాయిషీ కింద ఉన్న పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ స్కూళ్లను కూడా ప్రభుత్వ పరిధిలోకి తీసుకొని అందులో పనిచేస్తున్న టీచర్లకు ప్రభుత్వ టీచర్లతో స మానంగా అన్ని రకాల పోదోన్నతులు కల్పించాలని నోబుల్‌ టీచర్స్‌ అసోసియేషన (ఎనటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు ప్రభుత్వాన్ని కోరారు.

ప్రభుత్వ టీచర్లతో సమానంగా పదోన్నతులు కల్పించాలి
మాట్లాడుతున్న కొండూరు శ్రీనివాసరాజు

ఎన్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు

రాయచోటిటౌన, ఆగస్టు1(ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యాశాఖ అజమాయిషీ కింద ఉన్న పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ స్కూళ్లను కూడా ప్రభుత్వ పరిధిలోకి తీసుకొని అందులో పనిచేస్తున్న టీచర్లకు ప్రభుత్వ టీచర్లతో స మానంగా అన్ని రకాల పోదోన్నతులు కల్పించాలని నోబుల్‌ టీచర్స్‌ అసోసియేషన (ఎనటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం ఆయన రాయచోటి పట్టణంలోని ఎన్టీఏ జిల్లా కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడుతూ 2020- 21లో ఎలాగైతే కొన్ని ఎయిడెడ్‌ సూళ్ల టీచర్లకు ప్రభుత్వ టీచర్ల హోదా కల్పించారో అదేవిధంగా పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ స్థానిక సంస్థల పాఠశాలలను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వారికి కూడా ప్రభుత్వ టీచర్ల హోదా కల్పించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా పరిషత, మండల పరిషత, మున్సిపల్‌ పాఠశాలలకు కావాల్సిన భవనాలు, నిర్వహణా నిధులు, టీచర్ల పర్యవేక్షణతో పాటు టీచర్ల సర్వీసు మాటర్స్‌, నియమకాలు, పదోన్నతులు అంతా ప్రభుత్వ నిధులతోనే నుస్తున్నాయన్నారు. నాన టీచింగ్‌ స్టాఫ్‌తో సహా అందరికీ జీతాలు స్కూల్‌ ఎడ్యుకేషన నిధులతోనే వస్తున్నా యన్నారు. నోబుల్‌ టీచర్స్‌ అసోసియేషన నేతలు మడితాటి నరసింహారెడ్డి, శివభాస్కర్‌, వేణుగోపాల్‌, రెడ్డప్పరెడి ్డ, మోహననాయక్‌, సుబ్బారెడ్డి, శివప్రసాద్‌, నాగరాజ, రెడ్డయ్య, రెడ్డెన్న, కులశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Aug 02 , 2025 | 12:41 AM