అడవిలో మంటలను అదుపుచేసిన అటవీ సిబ్బంది
ABN , Publish Date - Apr 27 , 2025 | 10:10 PM
సిద్దవటం ఫారెస్ట్ రేంజి పరిధిలోని సిద్దవటం, మద్దూరు అటవీబీట్‌లో శనివారం రాత్రి అడవికి ఆకతాయిలు ని ప్పు పెట్టడంతో ఫారెస్ట్ రేంజ్ అధికారి కళావతి ఆ ధ్వర్యంలో సిబ్బందితో మంటలను అదుపులోకి తీ సుకొచ్చారు.

సిద్దవటం, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): సిద్దవటం ఫారెస్ట్ రేంజి పరిధిలోని సిద్దవటం, మద్దూరు అటవీబీట్‌లో శనివారం రాత్రి అడవికి ఆకతాయిలు ని ప్పు పెట్టడంతో ఫారెస్ట్ రేంజ్ అధికారి కళావతి ఆ ధ్వర్యంలో సిబ్బందితో మంటలను అదుపులోకి తీ సుకొచ్చారు. ఆదివారం సిద్దవటం అటవీశాఖ కార్యాలయంలో కళావతి మాట్లాడుతూ ఆకతాయిలు నిప్పు పెట్టడంతో కొండ ప్రాంతంలో మంటలు ఎగిసిపడుతున్నట్లు సమాచారం రావడంతో సిబ్బంది అప్రమత్తమై మంటలను వాటర్ పంపులు, చెట్లకొమ్మలు, బ్లోయర్స్ ఉపయోగించి అదుపులోకి తీసుకువచ్చారన్నారు. వన్యప్రాణుల సంరక్షణకు అటవీ ప్రాంతం పచ్చదనంతో ఉండేటట్లు ప్రతిఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. కొండకు నిప్పు పెట్టడం వన్యప్రాణులు అంతరించిపోయే ప్రమాదం ఉం దని, వన్యప్రాణుల సంరక్షణ ప్రతిఒక్కరు బాధ్యత వహించాలన్నారు. డిప్యూటీ రేంజర్ ఓబులేశు, సెక్షన ఆఫీసర్ సురే్‌షబాబు, ఎఫ్‌బీవోలు పెంచల్‌రెడ్డి, దీపిక, మధు, ఆది విశ్వనాఽథ్ పాల్గొన్నారు.