నాడు-నేడుకు నిధుల కొరత
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:43 PM
గత వైసీపీ హయాంలో నాడు-నేడు పధకం కింద చేపట్టిన పాఠశాలల భవనాలకు నిధుల కొరత వేధిస్తోంది.

అర్ధాంతరంగా నిలిచిపోయిన నిర్మాణ పనులు
42 స్కూళ్ల భవనాలకు రూ.12కోట్లు
కాగా విడుదలైనది రూ.8కోట్లు
వేధిస్తున్న అదనపు భవనాల సమస్య
ప్రస్తుత ప్రభుత్వం నిధులు మంజూరు చేసి
పూర్తిచేయాలని వినతి
పోరుమామిళ్ల, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి) : గత వైసీపీ హయాంలో నాడు-నేడు పధకం కింద చేపట్టిన పాఠశాలల భవనాలకు నిధుల కొరత వేధిస్తోంది. దీంతో అర్ధాంతరంగా భవనాలు ఆగి పోవడంతో విద్యాబోధనకు సౌకర్యాల్లేక ఇబ్బం దులు తప్పడంలేదు. పోరుమామిళ్ల మండలం లో నాడు-నేడు 42 పాఠశాలల భవనాలు, అద నపు గదుల నిర్మాణాలకు సంబంధించి రూ.12 కోట్లు నిధులు మంజూరు కాగా 8 కోట్లు మాత్ర మే విడుదల చేసింది. రూ.4కోట్లు వస్తే కానీ అసంపూర్తి భవనాలను పూర్తి చేయలేని పరి స్థితి. దళితవాడలో పది రకాలకు సంబంధించి పనులు అయిపోగా టాయ్‌లెట్ పనులు పెం డింగ్‌లో ఉన్నాయి. గానుగపెంట జిల్లా పరిషత హైస్కూలులో టెనకాంపోనెంట్స్ పనులు అయి పోగా అదనపు తరగతి గదుల నిర్మాణానికి రెం డు లెంటల్ లెవల్‌లోనే ఉండిపోయాయి. రేప ల్లెలో కిచెనషెడ్డు మినహా అన్ని పూర్తయ్యాయి. పోరుమామిళ్ల జిల్లాపరిషత హైస్కూలులో అదనపు తరగతిగదుల నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. ఒకటి గోడౌన వరకు పనులు పూర్తయ్యాయి. టెనకాంపోనెంట్స్ పనులు మా త్రం పూర్తయ్యాయి. వెంకటాపురం జిల్లాపరిషత హైస్కూలులో అదనపు తరగతి గదుల నిర్మా ణాలు లెంటల్ లెవెల్‌లో ఉండిపోగా అంగన్వాడీ నిర్మాణం శ్లాబు పూర్తయింది. ఫినిషింగ్ వర్క్ జరగాల్సి ఉంది. ఇందిరానగర్‌లో టెన కాంపో నెంట్స్ పనులు పూర్తయినా కిచెన,టాయిలెట్లు పెండింగ్‌లో ఉండిపోయాయి. కవలకుంట్ల జిల్లాపరిషత హైస్కూలులో అదనపు తరగతి గదుల నిర్మాణాలు మూడు శ్లాబులెవల్ వరకు వచ్చాయి. ఎస్సీ కాలనీలో టెనకాంపోనెంట్స్ పూర్తయినా కిచెన షెడ్డు పూర్తికావాల్సి ఉంది. పెద్దకప్పలపల్లెలో అదనపు తరగతి గదులు లెంటల్ లెవల్ వరకు జరిగాయి. టేకూరుపేట లో అదనపు తరగతి గదుల నిర్మాణం బేస్‌మ ట్టం లెవల్‌లోనే ఉండిపోయాయి. పోరుమా మిళ్ల ఎంపీపీ మెయిన స్కూలు చిన్నచిన్న పను లు తప్ప మిగతావి పూర్తయ్య్యాయి. ఉర్దూ జిల్లా పరిషత హైస్కూలులో టాయిలెట్లు నిర్మా ణాలు పూర్తి కావాల్సి ఉంది. కాపు వీధిలో టాయిలెట్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. 16వవార్డులోని ఉర్దూ స్కూలులో కూడా టాయి లెట్లు నిర్మాణం పెండింగ్‌లోఉంది. గిరినగర్‌లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఫస్ట్‌ఫ్లోరు అయిపోయాయి. గోడల నిర్మాణం, అంగన్వాడీ నిర్మాణాలు పూర్తికావాల్సి ఉంది. ఈ నిర్మాణా లన్నీ వచ్చే విద్యాసంవత్సరానికి పూర్తికావాలం టే కనీసం గత ప్రభుత్వం చేసిన అంచనాల ప్రకారం రూ.4 కోట్లు నిధులు మంజూరు కావాల్సిఉంది. కానీ ప్రస్తుతం పది శాతం పెం డింగులో ఉన్న 14 స్కూళ్లకు సంబంధించి రూ.23,70,733 నిధులు మంజూరయ్యాయి. అవి కూడా ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చేంత వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకూ డదని ఆదేశాలుండడంతో పనులు చేపట్టలేకు న్నారు. కాగా నాడు-నేడు పనుల నిర్మాణాల విషయమై ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ ఓబన్నను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, గతంలో వాటి పర్యవేక్షణ బాధ్యతలు తమకు అప్పజెప్పారని, ప్రస్తుతం ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చేంత వరకు డబ్బులు ఖర్చు పెట్టకూడదని ఆదేశాలు ఉన్నాయన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు ఎలా వస్తాయో ఆ మేరకు పనులు చేపట్టి పూర్తి చేస్తామన్నారు.