Share News

అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం

ABN , Publish Date - Aug 02 , 2025 | 11:48 PM

అన్నదాతకు కూటమి ప్రభుత్వం అం డగా నిలుస్తుందని జనసేన రైల్వేకోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అరవ శ్రీధర్‌, కుడా చైర్మన ముక్కా రూపానందరెడ్డి తెలిపారు.

అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం
మెగా చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే శ్రీధర్‌, ముక్కారూపానందరెడ్డి

రైల్వేకోడూరు, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): అన్నదాతకు కూటమి ప్రభుత్వం అం డగా నిలుస్తుందని జనసేన రైల్వేకోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అరవ శ్రీధర్‌, కుడా చైర్మన ముక్కా రూపానందరెడ్డి తెలిపారు. శనివారం రైల్వేకోడూరు నియోజకవర్గ కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన యోజన పథకంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నదాతకు గత వైసీపీ ప్రభుత్వం పెట్టుబడి సా యం కింద తక్కువగా ఇస్తున్నారని, అయితే కూటమి ప్రభుత్వం ఎక్కువగా ఇస్తోందని పేర్కొన్నారు. సూపర్‌ సిక్స్‌లో భాగంగా ప్రతి రైతుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5000, కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.2000 ఇస్తున్నట్లు తెలిపారు. సూపర్‌సిక్స్‌ విషయంలో చెప్పిన మాట చెప్పినట్లు కూటమి ప్రభుత్వం ఇస్తోందన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ప్రతి ఏటా రూ. రైతుల ఖాతాల్లో రూ.20,000 జమ అవుతుందన్నారు. రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, చిట్వేలి, పెనగలూరు, పుల్లంపేట మండలాల్లో రూ.24,622 మంది రైతులకు రూ.17.24 కోట్లు వారి ఖాతాల్లో జమ అవుతుందన్నారు. ఇటీవల మామిడి రైతులకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందన్నారు. అలాగే బొప్పాయి రైతులకు కలెక్టర్‌తో మాట్లాడి రైతులు, దళారులు, మార్వాడీలతో చర్చలు జరిపి టన్నుకు రూ.9000 తగ్గకుండా చేశామని వారు స్పష్టం చేశారు. సుపరిపాలన తొలిఅడుగులో భాగంగా ప్రజల్లోకి వెళ్లినప్పుడు చాలా సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. ప్రజలు పేదరికం నుంచి బయటపడాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవనకళ్యాణ్‌ ఆలోచించి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే వారందరికీ ఒక్కొక్కరికి రూ.13,000 అందిస్తున్నారన్నారు. అలాగే ఈనెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారన్నారు. అనంతరం రైతులకు మినుము విత్తనాల కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ మణి, ఏవోలు సందీప్‌, మల్లిక, సుధాకర్‌, శ్రీకర్‌, సుబ్రహ్మణ్యం, తహసీల్దార్‌ కోనేటి అమర్‌నాథ్‌, ఎంపీడీవో నాగార్జునరావు, టీడీపీ కో డూరు పరిశీలకులు గురిగింజకుంట శివప్రసాద్‌నాయుడు, కిసాన మోర్చా జిల్లా అధ్యక్షుడు జయప్రకాష్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన పగడాల వరలక్ష్మి, మండల ప్రత్యేకాధికారి మస్తాన, జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, రాయలసీమ జనసేన కన్వనీర్లు పగడాల వెంకటేష్‌, జోగినేని మణి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన సంగరాజు రవికుమార్‌రాజు, మైసూరివారిపల్లె సర్పంచ కారుమంచి సంయుక్త, టీడీపీ కోడూరు క్లస్టర్‌ ఇనచార్జ్‌ పఠాన మౌలా, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Aug 02 , 2025 | 11:49 PM