Share News

సీఎం సహాయ నిధి పంపిణీ

ABN , Publish Date - Jul 30 , 2025 | 11:19 PM

సీఎం సహాయ నిధి ద్వారా దగ్గుపాటి పురందేశ్వరి సహకారంతో జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయిలోకేశ రాజంపేట మండలం మందరం గ్రామానికి చెందిన చాపల ఈశ్వరమ్మకు రూ.60వేల చెక్కును అందజేశారు.

సీఎం సహాయ నిధి పంపిణీ
చెక్కును అందజేస్తున్న సాయిలోకేశ, బీజేపీ నాయకులు

రాజంపేట, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : సీఎం సహాయ నిధి ద్వారా దగ్గుపాటి పురందేశ్వరి సహకారంతో జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయిలోకేశ రాజంపేట మండలం మందరం గ్రామానికి చెందిన చాపల ఈశ్వరమ్మకు రూ.60వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీఎం సహాయనిధి ద్వారా ఆర్థికసాయం అందజేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. నరసింహరాజు, కృష్ణయాదవ్‌, సునీతానారాయణవర్మ, ప్రసాద్‌రెడ్డి, రమణయ్య, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2025 | 11:19 PM