Share News

పేదరిక నిర్మూలనే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం

ABN , Publish Date - Apr 27 , 2025 | 10:07 PM

పేదరిక నిర్మూలనే ముఖ్యమంత్రి చంద్ర బాబు లక్ష్యమని రాష్ట్ర రవాణా, యువ జన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్‌రెడ్డి అన్నారు.

పేదరిక నిర్మూలనే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం
సమస్యలు వింటున్న మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

సంబేపల్లె,ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): పేదరిక నిర్మూలనే ముఖ్యమంత్రి చంద్ర బాబు లక్ష్యమని రాష్ట్ర రవాణా, యువ జన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్‌రెడ్డి అన్నారు. సంబేపల్లె మం డలం నాగిరెడ్డిగరిపల్లె గ్రామ పంచాయతీలో ఆదివారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి రాం ప్రసాద్‌రెడ్డికి యువగళం సిద్దారెడ్డి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలి కారు. ఆయన ఇచ్చిన తేనేటి విందులో మంత్రి పాల్గొన్నారు. అక్కడి ప్రజల సమస్యలను అధికారులతో ఫోనలో మా ట్లాడి పరిష్కరించారు. అనంతరం పోతువాండ్లపల్లెలో ఎ ర్రగుడి రామ్మోహనరెడ్డి ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నితిన మౌర్యరెడ్డి, మాజీ జె డ్పీటీసీ మల్లు నరసారెడ్డి, భయ్యారెడ్డి, శే ఖర్‌రెడ్డి, విష్ణువర్థనరెడ్డి, వెంకటేశ్వర్‌నాయుడు, మహదేవరెడ్డి, నాగార్జుననాయుడు, మాజీ మండల ఉపాధ్యక్షుడు నాగరంజనవల్లి, బాబయ్య, ఆలంసాహెబ్‌, సంతోశ, చంద్రబాబునాయుడు, రాజశేఖర్‌నాయుడు, పలువురు టీడీపీ కార్యకర్తలుపాల్గొన్నారు.

బోనమల గ్రామంలో నీటి సమస్యకు పరిష్కారం

చిన్నమండెం, ఏప్రిల్‌27(ఆంధ్రజ్యోతి): చి న్నమండెం మండలం బోనమల కస్పాలో నీటి సమస్యకు శాశ్వత చర్యలు తీసు కుంటామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బోనమల గ్రామ ప్రజలు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా ఆయన వారితో మాట్లాడారు. మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని వారికి హామీ ఇచ్చారు.

Updated Date - Apr 27 , 2025 | 10:07 PM