Share News

అభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారు

ABN , Publish Date - Aug 02 , 2025 | 12:15 AM

రాష్ట్ర ముఖ్యమం త్రి చంద్రబాబునాయుడు అభివృ ద్ధే లక్ష్యంగా పనిచేస్తూ ముందు కు సాగుతున్నారని జిల్లా ఇన్‌ చార్జి మంత్రి సవిత పేర్కొన్నారు.

 అభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారు
వితంతు పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి సవిత, ఎమ్మెల్యే సుధాకర్‌యాదవ్‌

అర్హులందరికి పింఛన్లు పంపిణీ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత

మైదుకూరు రూరల్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) :రాష్ట్ర ముఖ్యమం త్రి చంద్రబాబునాయుడు అభివృ ద్ధే లక్ష్యంగా పనిచేస్తూ ముందు కు సాగుతున్నారని జిల్లా ఇన్‌ చార్జి మంత్రి సవిత పేర్కొన్నారు. స్థానిక 14వ వార్డులోని మూల బాటలో శుక్రవారం కొత్తగా మం జూరైన పింఛన్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత, మైదుకూరు ఎమ్మె ల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైదుకూరు నియోజకవర్గంలో నేడు సుమారు 36 వేల మందికి పింఛన్లును, దాదాపు 15 కోట్ల 4 లక్షల రూపాయలను డబ్బులను పంపిణీ చేస్తున్నామన్నారు.ఈ నెల 15వ తేదిన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభిస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాషా్ట్రన్ని అడ్డగోలుగా దోచుకొన్నారు. ఇప్పుడిప్పుడే రాషా్ట్రన్ని సీఎం చంద్ర బాబు ఒక గాడిలో పెడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసులరెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు దాసరిబాబు, పార్టీ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు ధనపాల జగన్‌, మున్సిపల్‌ చైర్మన్‌ మాచనూరు చంద్ర, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఏపీ రవీంద్ర, పట్టణ టీడీపీ ఉపా ధ్యక్షుడు యాపరాల లక్ష్మినారాయణ, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్‌ యాపరాల చిన్న, తెలుగుయువత నియోజకవర్గ అధ్యక్షుడు బురుగోళ్ల చిన్న, ధనపాల రవి, యుగంధర్‌, పాలమాబు, పందిటి పెద్దయ్య, చిగురుపాటి సుబ్బరాయుడు, కటారి కృష్ణ, తుపాకుల రమణ పాల్గొన్నారు.

టీడీపీలో అంతర్గత కలహాలు బహిర్గతం : స్థానిక మూలబాటలో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే సమక్షంలోనే ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మున్సిపల్‌ చైర్మన్‌ మాచనూరు చంద్రను టీడీపీ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు ధనపాల జగన్‌ మా ఎమ్మెల్యే కార్యక్రమానికి రావద్దు అంటూ తోశాడు. దీంతో కొద్దిసేపు ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే ఇరువురికి సర్దిచెప్పి పంపించారు.

Updated Date - Aug 02 , 2025 | 12:15 AM