Share News

తల్లిపాలే బిడ్డకు శ్రేష్టం

ABN , Publish Date - Aug 02 , 2025 | 12:44 AM

బిడ్డ పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు ఇవ్వాలని, తల్లీ బిడ్డకు పాలివ్వడం వల్ల గర్భాశయ, రొమ్ముక్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయని ఐసీడీఎస్‌ సీడీపీవో వాణిశ్రీ తెలిపారు.

తల్లిపాలే బిడ్డకు శ్రేష్టం
పార్వతీపురం అంగన్వాడీ సెంటర్‌ వారోత్సవాల్లో పాల్గొన్న సీడీపీవో వాణిశ్రీ

ఐసీడీఎస్‌ సీడీపీవో వాణిశ్రీ

సిద్దవటం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) : బిడ్డ పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు ఇవ్వాలని, తల్లీ బిడ్డకు పాలివ్వడం వల్ల గర్భాశయ, రొమ్ముక్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయని ఐసీడీఎస్‌ సీడీపీవో వాణిశ్రీ తెలిపారు. ఆగస్టు ఒకటి నుంచి ఏడో తేదీ వరకు జరిగే తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా మండలంలోని పార్వతిపురం, దిగువపేట గ్రామాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఐసీడీఎస్‌ సీడీపీవో వాణిశ్రీ మాట్లాడుతూ తల్లిపాల వల్ల పుట్టిన శిశువుకు సరైన పోఫణ అంది రోగ నిరోఽధకశక్తి పెరిగి అలర్జీ ప్రమాదాలు తగ్గుతాయని, పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు పట్టాలని తల్లిపాలు శివువుకు అమృతం లాంటిదని, తల్లిపాలు శిశువుకు సులువుగా జీర్ణమవుతాయని, బ్రెయిన డెవల్‌పమెంట్‌ ఉంటుందన్నారు. కుటుంబ సభ్యులు స్నేహభరిత సేవాభావం తల్లికి, తన బిడ్డకు ముర్రుపాలు ఇచ్చేందుగు ప్రోత్సాహం ఇవ్వాని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీడీపీవో శోభారాణి, సూపర్‌వైజర్‌లు శ్రీవిద్య, వరలక్ష్మీ, అంగన్వాడీ కార్యకర్తలు, గర్భవతులు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - Aug 02 , 2025 | 12:44 AM