MP Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్..!
ABN , Publish Date - Jul 15 , 2025 | 03:18 PM
MP Mithun Reddy: ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఈ కేసు విచారణ కీలక దశలో ఉన్నందున ఇప్పుడు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.

YSRCP MP Mithun Reddy: రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కామ్ కేసులో (Liquor Scam Case) తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి (Mithun Reddy) హైకోర్టులో (AP High Court) పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే, ఈరోజు ఆ పిటిషన్ పై కీలక నిర్ణయం తీసుకున్న ధర్మాసనం.. మిథున్ రెడ్డి బెయిల్ పిటీషన్ ను డిస్మిస్ చేసింది. మద్యం కుంభకోణం విచారణ కీలక దశలో ఉన్నందున ఇప్పుడు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. దీంతో త్వరలో ఈ కేసులో మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఆయన ఏ4.. బెయిల్ ఇవ్వొద్దు!
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ రాకుండా ఉండేలా వాదనలు వినిపించారు సీఐడీ/సిట్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా. 2019 ఎన్నికలకు ఏపీలో మద్యం ఆర్డర్లు, సరఫరా వ్యవస్థ పూర్తిగా ఆన్లైన్ పద్దతిలో ఉండి.. పారదర్శకతగా ఉండేదని, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దానిని మాన్యువల్ పద్దతికి మార్చిందని అన్నారు. ఈ విధానం అమలు వెనక మిథున్ రెడ్డి కీలకంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.
ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.3,500 కోట్ల నష్టం జరిగిందని సిట్ అధికారుల విచారణలో తేలిందని.. ఇప్పుడు ఈ కేసు తుది దశకు వచ్చిందని.. ఈ సమయంలో ఈ కేసులో ఏ4గా ఉన్న మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడం ద్వారా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని న్యాయమూర్తిని కోరారు. సిద్ధార్థ లూథ్రా వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
ఇవి కూడా చదవండి..
వాకింగ్ చేస్తున్న నేతపై కాల్పులు.. హైదరాబాద్‌లో దారుణం
మరికొన్ని గంటల్లో ఉరి.. అద్భుతం జరుగుతుందా?..