Share News

BREAKING: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్?

ABN , Publish Date - Jul 18 , 2025 | 12:01 PM

YCP MP Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి రెండు షాకులు తగిలాయి. ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. మరోవైపు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వారెంట్ కోరుతూ విజయవాడ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. కాగా త్వరలోనే మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతారనే చర్చ జరుగుతోంది.

BREAKING: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్?

YCP MP Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో వారెంట్ కోరుతూ విజయవాడ కోర్టులో (Vijayawada) పిటిషన్ వేశారు. మిథున్ రెడ్డి వైసీపీ ఎంపీ (YCP) కావడంతో ఆయన తలదాచుకున్న ప్రాంతాల్లో సోదాలు, అరెస్ట్ చేసేందుకు చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నారు సిట్ అధికారులు. కాగా మద్యం కుంభకోణంలో (Liquor Scam Case) మిథున్ రెడ్డి వేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ ను హైకోర్టు (AP High Court) డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే.


మిథున్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ..!

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది . ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈరోజు మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు.. మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది.

లిక్కర్ కేసులో తన ప్రమేయం లేకపోయినా.. రాజకీయ కక్షలో భాగంగా తనను అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారని మిథున్ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణ జరిపిన జస్టిస్ జెబి పార్థివలా, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం.. అరెస్ట్ చేయకుండా ఛార్జ్ షీట్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. సరెండర్ కావడానికి వారం రోజులు గడువు ఇవ్వాలని మిథున్ రెడ్డి తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ధర్మాసనాన్ని కోరగా.. దానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. తాజాగా సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వారెంట్ కోరుతూ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. మిథున్ రెడ్డిని త్వరలోనే అరెస్ట్ చేస్తారంటూ చర్చ జోరందుకుంది. ప్రస్తుతం మిథున్ రెడ్డి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి..

మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ పార్టీ కేసులో ఈగల్ టీం దూకుడు

ఉగ్రవాద కార్యకలాపాలపై అమెరికా విదేశాంగ శాఖ కీలక ప్రకటన

Updated Date - Jul 18 , 2025 | 12:26 PM