రెవెన్యూ సేవల కోసం కష్టాలు తప్పవా?
ABN , Publish Date - Apr 27 , 2025 | 11:47 PM
మండలవాసులు రెవెన్యూ సేవల కోసం కష్టాలు పడుతున్నారు.

మైదుకూరుకు అల్లంత దూరంలో తహసీల్దార్ కార్యాలయం ఇక్కట్లు పడుతున్న జనం ఎమ్మెల్యే చొరవ చూపాలంటున్న వైనం
మైదుకూరు రూరల్ ,ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): మండలవాసులు రెవెన్యూ సేవల కోసం కష్టాలు పడుతున్నారు. ప్రస్తుతం ఎలాంటి రెవెన్యూ సంభం దమైన పనుల కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే నియోజవర్గ కేంద్రమైన మైదుకూరు తహసీల్దార్ కార్యాల యం పట్టణానికి సుమారు రెండు కిలోమీటర్లు దూరంలో ఏర్పాటు చేశా రు. దీంతో మైదుకూరు మున్సిపాలిటీతోపాటు మండల ప్రజలు రెవెన్యూ ఆఫీసుకు వెళ్లాంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. గతంలో పాత భవనంలో రెవెన్యూ ఆఫీసు ఉండటం వలన గ్రామాల్లోని ప్రజలు మైదుకూరు బస్‌స్టాండ్‌లో దిగి నడుచుకొంటు వెళ్లి రావడమే కాకుండా సత్వర పనులు కాకున్నా మళ్లీ మళ్లీ రావడానికి సులభతరంగా ఉండేది. అయితే ఇప్పుడు తహసీల్దార్ కార్యాలయం అల్లంత దూరంగా ఉండడం తో బస్‌స్టాండ్‌లో దిగినా సుమారు వంద రూపాయలు పెడితే గాని ఆఫీ సుకు వెళ్లలేమని ప్రజలు వాపోతున్నారు. ఈ పరిస్థితిని గమనించి 2019 ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ తహసీ ల్థార్ కార్యాలయాన్ని తిరిగి పాత భవనంలోకి మారుస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నికల్లో గెలిచిన పిమ్మట జిల్లా కలెక్టర్‌ను మైదుకూరుకు పిలిపించి తహసీల్దార్ కార్యాలయ భవనాలను విజిట్ చేసినా ఇంత వరకు పనులు మాత్రం మొదలు పెట్టలేదు. దీనిపై ప్రజలు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ వెంటనే స్పందించి తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని పాత భవనంలోకి తీసుకొచ్చే పనులు మొదలు పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. కాగా ఎమ్మెల్యే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టు కోవాలని మండలంతో పాటు నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.