అక్రమంగా చేపల వేట నిర్వహిస్తే చర్యలు
ABN , Publish Date - Aug 02 , 2025 | 11:50 PM
అన్నమయ్య జిల్లాలోని సోమశిల వెనుకజలాల్లో చేపల అక్రమ వేట నిర్వహిస్తే వారిపై చర్యలు తప్పవని మత్స్యశాఖ అధికారి మురళీకృష్ణ పేర్కొన్నారు.

నందలూరు, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి) : అన్నమయ్య జిల్లాలోని సోమశిల వెనుకజలాల్లో చేపల అక్రమ వేట నిర్వహిస్తే వారిపై చర్యలు తప్పవని మత్స్యశాఖ అధికారి మురళీకృష్ణ పేర్కొన్నారు. శనివారం సోమశిల వెనుకజలాల్లో చేపల అక్రమ వేటపై టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై నెల ఒకటి నుంచి మత్స్యశాఖ అధికారులు వేట చేయనివ్వకుండా నిషేధించినప్పటికీ కొందరు సాగిస్తున్నారన్నారు. దీనిపై కలెక్టర్ శ్రీధర్‌కు ఫిర్యాదులు అందడంతో స్పందించి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలని టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేశారని పేర్కొ న్నారు. తనిఖీల్లో భాగంగా ఈనెల 31 తేదీ వరకు చేపల వేట చేయరాదని, ఖాళీ చేసి వెళ్లిపోవాలని మత్స్యకారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారి ప్రసాద్‌నాయక్, కానిస్టేబుల్ చెన్నయ్య పాల్గొన్నారు.