Share News

Former CM Jagan: అక్రమాస్తుల కేసు.. మెమో దాఖలు చేసిన మాజీ సీఎం జగన్

ABN , Publish Date - Nov 07 , 2025 | 10:17 AM

ఆంధ్ర‌ప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన అక్రమాస్తుల కేసుకు సంబంధించి మాజీ సీఎం జగన్ మరో నిర్ణయం తీసుకున్నారు. సీబీఐ కోర్టులో ఆయన మెమో దాఖలు చేశారు. ఈ నెల 14లోపు వ్యక్తిగతంగా హాజరుకావాలని సీబీఐ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. గడువు సమీపిస్తుండటంతో ఆయన మెమో దాఖలు చేశారు.

Former CM Jagan: అక్రమాస్తుల కేసు.. మెమో దాఖలు చేసిన మాజీ సీఎం జగన్
Former CM Jagan

అమరావతి, నవంబర్ 7: అక్రమాస్తుల కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. యూరప్ పర్యటన తర్వాత ఈనెల 14 లోపు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని గతంలో జగన్ ను సీబీఐ కోర్టు ఆదేశించింది. న్యాయస్థానం ఇచ్చిన గడువు సమీపిస్తుండడంతో సీబీఐ కోర్టులో ఆయన మెమో దాఖలు చేశారు. వ్యక్తిగత హాజరు మినహయించాలని పిటిషన్ లో పేర్కొన్నారు.


సీబీఐ కోర్టు ముందు తాను హాజరు సమయంలో రాష్ట్ర యంత్రాంగం ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని.. ఇది యంత్రాంగానికి భారమని ప్రస్తావించారు. తప్పనిసరిగా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని కోర్టు భావిస్తే హాజరయ్యేందుకు తాను సిద్ధమేనని స్పష్టం చేశారు. కోర్టు అనుమతిస్తే తాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు.


ఇవి కూడా చదవండి:

Sabarimala Special Trains: శబరిమలకు 60 కి పైగా స్పెషల్ ట్రైన్స్

AP Farmers: ఏపీలో రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్‌లలో రూ.50 వేలు చొప్పున జమ

Updated Date - Nov 07 , 2025 | 11:08 AM