Share News

కక్షపూరిత రాజకీయాలకు కేరాఫ్‌ జగన్‌: కొల్లు

ABN , Publish Date - Jul 06 , 2025 | 04:20 AM

వైసీపీ నాయకులు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కక్షపూరిత రాజకీయాలకు కేరాఫ్‌ జగన్‌: కొల్లు

అమరావతి, జూలై 5(ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకులు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయింది. గ్రామాల్లో నెత్తుటి ఏర్లు పారించిన సంస్కృతి జగన్‌రెడ్డిది. బియ్యం దొంగతనం చేసిన వ్యక్తితో జగన్‌ ప్రెస్‌మీట్లు పెట్టిస్తున్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను హింసించారు. గుంటూరు జిల్లాలో వైసీపీ నాయకుల వేధింపులకు భయపడి ఊర్లు ఖాళీ చేశారు. కక్షపూరిత రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ జగన్‌. టీడీపీ కార్యాలయంపై దాడులు చేసిన వారికి పదోన్నతులు ఇచ్చి ప్రోత్సహించిన ఘనత జగన్‌ది’ అని మంత్రి కొల్లు ధ్వజమెత్తారు.

Updated Date - Jul 06 , 2025 | 04:21 AM