Share News

Sullurpeta: షార్‌కు చేరిన జీఎస్ఎల్వీ-ఎఫ్‌16 రెండో దశ పరికరం

ABN , Publish Date - Apr 28 , 2025 | 04:16 AM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌16 రాకెట్‌ యొక్క రెండో దశ పరికరాన్ని షార్‌కు చేరింది. ఈ రాకెట్‌ ద్వారా ఇస్రో-నాసాకు చెందిన నిసార్‌ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపించనున్నారు

Sullurpeta: షార్‌కు చేరిన జీఎస్ఎల్వీ-ఎఫ్‌16 రెండో దశ పరికరం

సూళ్లూరుపేట, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) త్వరలో చేపట్టనున్న జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌16 రాకెట్‌ ప్రయోగానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈ రాకెట్‌కు సంబంధించిన రెండో దశ (జీఎస్‌2) పరికరం ఆదివారం శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌కు చేరింది. తమిళనాడు రాష్ట్రం మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్‌ కాంప్లెక్స్‌ (ఐపీఆర్‌సీ) నుంచి దీన్ని రెండు ప్రత్యేక వాహనంలో భారీ భద్రత నడుమ రోడ్డు మార్గాన తీసుకొచ్చారు. ఇప్పటికే షార్‌లోని రెండో ప్రయోగ వేదిక వద్దనున్న వెహికల్‌ అసెంబ్లీ బిల్డింగ్‌ (వ్యాబ్‌)లో జీఎస్‌ల్వీ-ఎఫ్‌16 మొదటి దశ అనుసంధాన పనులు ఏప్రిల్‌ మొదటి వారంలో ప్రారంభించి పూర్తి చేశారు. సోమవారం నుంచి రాకెట్‌ రెండో దశ అనుసంధాన పనులు ప్రారంభించనున్నారు. ఈ రాకెట్‌ ద్వారా ఇస్రో-నాసాకు చెందిన నిసార్‌ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనున్నారు.

Updated Date - Apr 28 , 2025 | 04:17 AM