AP News: ఐర్లాండ్‌లో ఎన్టీయార్ జిల్లా వాసి మృతి!
ABN , Publish Date - Jan 31 , 2025 | 08:48 PM
ఎన్టీయార్ జిల్లా జగ్గయ్యపేట రూరల్ మండలంలోని గండ్రాయి గ్రామంలో విషాదం నెలకొంది. గండ్రాయి గ్రామానికి చెందిన చిట్టూరి భార్గవ్ ఉన్నత చదువు కోసం ఐర్లాండ్‌కి వెళ్లాడు. అక్కడ తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్గవ్ మృతి చెందాడు.

ఎన్టీయార్ జిల్లా జగ్గయ్యపేట రూరల్ మండలంలోని గండ్రాయి గ్రామంలో విషాదం నెలకొంది. గండ్రాయి గ్రామానికి చెందిన చిట్టూరి భార్గవ్ ఉన్నత చదువు కోసం ఐర్లాండ్‌కి వెళ్లాడు. అక్కడ తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్గవ్ మృతి చెందాడు. భార్గవ్‌తో పాటు గుంటూరుకు చెందిన చెరుకూరి సురేష్ కూడా అదే ప్రమాదంలో మరణించాడు. అదే వాహనంలో ఉన్న మరో అమ్మాయి అబ్బాయి కూడా ఉన్నారు. వారు తీవ్ర గాయాల పాలై ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
కాగా, ఉన్నత చదువులు చదివి తిరిగి వస్తాడనుకున్న కొడుకు విదేశాల్లో మరణించడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. కాగా, మృతదేహాన్ని భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయవాడ టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం ద్వారా మంత్రి లోకేష్ కు విజ్ఞప్తి చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం క్లిక్ చేయండి..