Eastern Naval Command: ఐఎన్‌ఎస్ నిస్తార్ నేడు జల ప్రవేశం
ABN , Publish Date - Jul 18 , 2025 | 04:34 AM
స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన డైవింగ్ సపోర్ట్ నౌక ‘ఐఎన్‌ఎస్ నిస్తార్’ను శుక్రవారం తూర్పు నౌకాదళంలో..

విశాఖపట్నం, జూలై 17(ఆంధ్రజ్యోతి): స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన డైవింగ్ సపోర్ట్ నౌక ‘ఐఎన్‌ఎస్ నిస్తార్’ను శుక్రవారం తూర్పు నౌకాదళంలో ప్రారంభించనున్నారు. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్‌సేథ్, భారత నౌకాదళం చీఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠీ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. విశాఖపట్నంలోని హిందూస్థాన్ షిప్‌యార్డ్ ఈ నౌకను తయారు చేసింది. 120కి పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దీని నిర్మాణానికి సహకరించాయి. నిస్తార్ నౌక బరువు 10,500 టన్నులు. పొడవు 120 మీటర్లు కాగా వెడల్పు 20 మీటర్లు. సముద్రం లోపల ప్రమాదంలో పడిన సబ్‌మెరైన్లలో రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించడం దీని ప్రధాన విధి. సబ్‌మెరైన్లలోని సిబ్బందిని అత్యవసరంగా తరలించడానికి వీటిని ఉపయోగిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్