పీఎస్ఆర్ కేసు వివరాలివ్వండి: హైకోర్టు
ABN , Publish Date - May 16 , 2025 | 03:28 AM
సీనియర్ ఐపీఎస్ పీఎస్ ఆర్ ఆంజనేయు పై కేసు వివరాలను సీఐడీ పోలీసులకు హైకోర్టు సమర్పించాలని ఆదేశించింది. బెయిల్ పిటిషన్ విచారణను మే 22కి వాయిదా వేసింది.

అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎ్‌సఆర్ ఆంజనేయులుపై నమోదు చేసిన కేసుకి సంబంధించి పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని సీఐడీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. బెయిల్ పిటిషన్‌పై విచారణను ఈనెల 22కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. సినీనటి కాదంబరీ జెత్వాని ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో పీఎ్‌సఆర్ ఆంజనేయులు ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. విజయవాడ రెండవ అదనపు జిల్లా కోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయడంతో ఆయన తాజాగా హైకోర్టును ఆశ్రయించారు.