మళ్లీ పెరిగిన ఎండ
ABN , Publish Date - Jun 19 , 2025 | 06:37 AM
రాష్ట్రంపైకి నైరుతి వైపు నుంచి గాలులు వీచినా.. పలుచోట్ల ఎండ తీవ్రత, ఉక్కపోత పెరిగాయి. కోస్తాతోపాటు దానికి ఆనుకుని ఉన్న రాయలసీమ జిల్లాల్లో బుధవారం ఎండ ప్రభావం ఎక్కువగా ఉంది.

జంగమహేశ్వరపురంలో 40.1 డిగ్రీలు
నేడు అక్కడక్కడ ఈదురుగాలులతో వర్షాలు
విశాఖపట్నం, జూన్ 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంపైకి నైరుతి వైపు నుంచి గాలులు వీచినా.. పలుచోట్ల ఎండ తీవ్రత, ఉక్కపోత పెరిగాయి. కోస్తాతోపాటు దానికి ఆనుకుని ఉన్న రాయలసీమ జిల్లాల్లో బుధవారం ఎండ ప్రభావం ఎక్కువగా ఉంది. జంగమహేశ్వరపురంలో 40.1, తిరుపతిలో 39.4, కావలిలో 38.8, నెల్లూరులో 38.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అక్కడక్కడ వర్షాలు కురిశాయి. కాగా, పశ్చిమబెంగాల్ పరిసరాల్లో ఉన్న అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది.
ఇది వాయవ్యంగా పయనించనుంది. ఇంకా గుజరాత్ పరిసరాల్లో అల్పపీడనం స్థిరంగా ఉంది. వీటి ప్రభావంతో బుధవారం నైరుతి రుతుపవనాలు మధ్య, వాయవ్య, తూర్పుభారతంలో అనేక ప్రాంతాలకు విస్తరించాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీ, బిహార్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్ వరకూ విస్తరించనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది.