Hardeep Singh Puri: ఏపీలో డైనమిక్ సీఎం: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్
ABN , Publish Date - Feb 22 , 2025 | 03:45 AM
డబులింజన్ సర్కార్‌తో అటు దేశం, ఇటు రాష్ట్రం రెండూ ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయి’ అని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ అన్నారు. గురువారం విజయవాడలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి రాష్ట్రంలోని మేధావులు, వర్తకులు, ఆర్థిక నిపుణుల నుంచి అభిప్రాయ సేకరణ జరిపారు.

ఏపీలో డైనమిక్ సీఎం: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ సొంత రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో తెలిసిన డైనమిక్ సీఎం ఏపీలో ఉన్నారు. దూరదృష్టితో కూడిన ఆయన ఆలోచనలకు మద్దతిచ్చే నరేంద్ర మోదీ ఢిల్లీలో ఉన్నారు. డబులింజన్ సర్కార్‌తో అటు దేశం, ఇటు రాష్ట్రం రెండూ ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయి’ అని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ అన్నారు. గురువారం విజయవాడలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి రాష్ట్రంలోని మేధావులు, వర్తకులు, ఆర్థిక నిపుణుల నుంచి అభిప్రాయ సేకరణ జరిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ... ‘వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో పనిచేస్తోన్న నరేంద్ర మోదీ దేశంలోని అన్ని రాష్ట్రాల అభివృద్ధికి సహకారం అందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఉన్న ఏపీపై మరింత ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. ఇక్కడి సీఎం నిధులు అడగ్గానే బడ్జెట్‌లో కేటాయించినవి కాకుండా అదనంగా అభివృద్ధికి విడుదల చేస్తున్నారు’ అని హర్దీప్ తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నేతలు పాతూరి నాగభూషణం, అడ్డూరి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.