GST Growth: పెరిగిన జీఎస్టీ వసూళ్లు
ABN , Publish Date - Jul 02 , 2025 | 04:34 AM
రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. ఈ ఏడాది జూన్‌లో రూ.2,591 కోట్ల నికర జీఎస్టీ వసూలైంది. 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జూన్ నెలకు ఇదే అత్యధికం.

జూన్‌లో రూ.2,591 కోట్ల వసూలు
తొలి త్రైమాసికం మొత్తం 8,860 కోట్లు
అమరావతి, జూలై 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. ఈ ఏడాది జూన్‌లో రూ.2,591 కోట్ల నికర జీఎస్టీ వసూలైంది. 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జూన్ నెలకు ఇదే అత్యధికం. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం(క్యూ1)లో మొత్తం వసూలైన నికర జీఎస్టీ రూ.8,860 కోట్లు. ఇది గత ఏడాది క్యూ1లో వసూలైన నికర జీఎస్టీకి 3.4 శాతం ఎక్కువ. క్యూ1లో మొత్తం పన్ను ఆదాయం రూ.13,361 కోట్లు వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో వచ్చిన రూ.13,096 కోట్ల కంటే ఇది 2.02 శాతం ఎక్కువ. అలాగే, ఈ ఏడాది జూన్‌లో పన్ను ఆదాయం రూ.4,167.66 కోట్లు వచ్చింది. గతేడాది జూన్‌లో వచ్చిన రూ.3,910 కోట్ల పన్ను ఆదాయం కంటే ఇది 6.58 శాతం ఎక్కువ. ఈ ఏడాది జూన్‌లో ఐజీఎస్టీ సెటిల్మెంట్ రూ.1,365 కోట్లు వచ్చింది. వృత్తి పన్ను రూ.29 కోట్ల నుంచి రూ.49 కోట్లకు పెరిగింది. లిక్కర్‌పై వ్యాట్ రూ.61 కోట్ల నుంచి రూ.86 కోట్లకు, పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్ రూ.1,380 కోట్ల నుంచి రూ.1,435 కోట్లకు పెరిగింది.