Share News

Group 1 Scam Case: గృహిణులతో గ్రూప్‌-1 దిద్దించారు

ABN , Publish Date - Jul 02 , 2025 | 06:29 AM

గ్రూప్‌-1 మెయిన్స్‌ మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడడంతోపాటు నిధులు దుర్వినియోగం చేసిన కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ క్యామ్‌సైన్‌ సంస్థ డైరెక్టర్‌ మధుసూదన్‌(ఏ2) వేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి.

Group 1 Scam Case: గృహిణులతో గ్రూప్‌-1 దిద్దించారు

  • మధుసూదన్‌ ఖాతా నుంచే నగదు బదిలీ

  • ఆయన బెయిల్‌ పిటిషన్‌కు విచారణార్హత లేదు: పీపీ మెండ

అమరావతి, జూలై 1(ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 మెయిన్స్‌ మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడడంతోపాటు నిధులు దుర్వినియోగం చేసిన కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ క్యామ్‌సైన్‌ సంస్థ డైరెక్టర్‌ మధుసూదన్‌(ఏ2) వేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ హయాంలో జరిగిన ఈ అక్రమాలపై విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసులో ఐపీఎస్‌ అధికారిపీఎస్ఆర్‌ ఆంజనేయులు(ఏ1), మధుసూదన్‌(ఏ2)ను నిందితులుగా పేర్కొన్నారు.


group-1.jpg

ఈ కేసులో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ మధుసూదన్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా మధుసూదన్‌కు కిడ్నీ, గాల్‌ బ్లాడర్‌కు సంబంధించి వైద్య నిపుణులతో పరీక్షలు నిర్వహించి నివేదికను కోర్టుముందు ఉంచాలని విజయవాడ జైలు సూపరింటెండెంట్‌ను హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. మంగళవారం మరోసారి విచారణకురాగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. బెయిల్‌ పిటిషన్‌కు విచారణార్హత లేదన్నారు. పిటిషనర్‌ అకౌంట్‌ నుంచే చెల్లింపులు చేశారన్నారు. మధుసూదన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌ వాదనలు వినిపించారు.

Updated Date - Jul 02 , 2025 | 07:55 AM