Tragic Accident: చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థుల మృతి..
ABN , Publish Date - Dec 04 , 2025 | 08:48 PM
చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది.
చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. గురువారం చిలకలూరిపేట బైపాస్‌పై రోడ్డుపై ఓ కారు కంటెయినర్ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ ఆ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గుంటూరు నుంచి ఒంగోలు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను విజ్ఞాన్ కాలేజ్ విద్యార్థులుగా గుర్తించారు.
ఊడిన బస్సు టైరు
నంద్యాల జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాణ్యం మండలం తమ్మరాజుపల్లి వద్ద ఆర్టీసీ అల్ట్రా డీలక్స్ బస్సు వెనుక టైరు ఊడిపోయింది. 100 మీటర్ల దూరంలోని జనసంద్రంలోకి దూసుకు వెళ్లింది. దీంతో ఒకరికి గాయాలు అయ్యాయి. కూరగాయల బండి ధ్వంసం అయింది. పలు బైకులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కర్నూలు డిపోకు చెందిన ఆల్ట్రా డీలక్స్ బస్సు కర్నూలు నుండి 30 మంది ప్రయాణికులతో తిరుపతికి వెళుతుండగా ప్రమాదం జరిగింది.
ఇవి కూడా చదవండి
ఇందుకే చెప్పేది.. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు అని..
శీతాకాలంలో ఏ విటమిన్ లోపం వల్ల పెదవులు పగులుతాయో తెలుసా?