Share News

Minister Payyavula Keshav: పరామర్శ పేరుతో అలజడులు: పయ్యావుల

ABN , Publish Date - Jul 11 , 2025 | 04:51 AM

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరిగే అవకాశాన్ని కల్పిస్తున్నామని, కానీ ఆయన పరామర్శల పేరుతో అశాంతి, అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు.

Minister Payyavula Keshav: పరామర్శ పేరుతో అలజడులు: పయ్యావుల

ఉరవకొండ, జూలై 10(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరిగే అవకాశాన్ని కల్పిస్తున్నామని, కానీ ఆయన పరామర్శల పేరుతో అశాంతి, అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో గురువారం మెగా పీటీఎంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసం పనిచేసే పోలీసు వ్యవస్థను కించపరిచి మాట్లాడడం సరికాదని అన్నారు. బంగారుపాళెంలో జగన్‌ రావడానికి ముందు ట్రాక్టర్లను బయటకు తీసుకువచ్చి, రోడ్డు మీద మామిడికాయలు పడేసి ఫొటో షూట్‌తో డ్రామా నడిపించారని ఎద్దేవా చేశారు.

Updated Date - Jul 11 , 2025 | 04:52 AM