Share News

Anganwadi: అంగన్వాడీల్లో జూలై 1 నుంచి ఫేస్‌ రికగ్నిషన్‌

ABN , Publish Date - Jun 20 , 2025 | 06:47 AM

జూలై 1వ తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహార పంపిణీకి లబ్ధిదారుల ఫేషియల్‌ రికగ్నిషన్‌ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Anganwadi: అంగన్వాడీల్లో జూలై 1 నుంచి ఫేస్‌ రికగ్నిషన్‌

  • ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

అమరావతి, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): జూలై 1వ తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహార పంపిణీకి లబ్ధిదారుల ఫేషియల్‌ రికగ్నిషన్‌ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా పోషణ ట్రాకర్‌లో ఫేస్‌ రికగ్నిషన్‌ ఆధారిత సేవల అమలుకు కేంద్రం చర్యలు తీసుకుంది. ఈ నెల 30 నుంచి లబ్ధిదారుల ప్రొఫైల్‌లో ఫేస్‌ అథెంటికేషన్‌ ఫీచర్‌ అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. దీంతో ఇకపై పౌష్టికాహారం(టీహెచ్‌ఆర్‌) పంపిణీ సమయంలో ఎఫ్‌ఆర్‌ఎస్‌ (ఫోటో క్యాప్చరింగ్‌, ఈ-కేవైసీ) తప్పనిసరికానుంది. ఈమేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులకు కేంద్ర మహిళా,శిశు సంక్షేమశాఖ ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - Jun 20 , 2025 | 06:47 AM