Share News

రైతులకు 69,975 విద్యుత్‌ కనెక్షన్లు పెండింగ్‌: మంత్రి గొట్టిపాటి

ABN , Publish Date - Mar 04 , 2025 | 06:10 AM

రైతులకు ఇవ్వాల్సిన వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు 69,975 పెండింగ్‌లో ఉన్నాయని, త్వరలో వాటిని మంజూరుచేస్తామని విద్యుత్‌ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు.

రైతులకు 69,975 విద్యుత్‌ కనెక్షన్లు పెండింగ్‌: మంత్రి గొట్టిపాటి

Gottipati Ravi Kumar:రైతులకు ఇవ్వాల్సిన వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు 69,975 పెండింగ్‌లో ఉన్నాయని, త్వరలో వాటిని మంజూరుచేస్తామని విద్యుత్‌ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. ఈ అంశంపై ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ(రాజానగరం), ముక్కు ఉగ్రనరసింహారెడ్డి (కనిగిరి) లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన జవాబు చెప్పారు. వ్యవసాయానికి పగటిపూట విద్యుత్‌ ఇవ్వాలని బలరామకృష్ణ కోరగా.. కనిగిరిలో పెద్దఎత్తున వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయని, రైతులకు కనెక్షన్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న అధికారులు.. ఆక్రమణలకు మాత్రం వెంటనే ఇస్తున్నారని ఉగ్రనరసింహారెడ్డి ఆరోపించారు. మంత్రి స్పందిస్తూ.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు 20,700 వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చామన్నారు.

Updated Date - Mar 04 , 2025 | 06:11 AM