వాడపల్లి క్షేత్రంలో యోగాంధ్ర
ABN , Publish Date - Jun 17 , 2025 | 01:16 AM
ఆత్రేయపురం, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీనివాస ప్రాంగణంలోని జిల్లా స్థాయి ఫ్యామిలీ యోగాంధ్ర కార్యక్ర మాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. యోగా సాధనపై ప్రజలకు అవగాహన కల్పిం చారు. యోగా సాధన ద్వారా సంపూర్ణ ఆ

పాల్గొన్న కోనసీమ కలెక్టర్ మహేష్‌కుమార్,
కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు
ఆత్రేయపురం, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీనివాస ప్రాంగణంలోని జిల్లా స్థాయి ఫ్యామిలీ యోగాంధ్ర కార్యక్ర మాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. యోగా సాధనపై ప్రజలకు అవగాహన కల్పిం చారు. యోగా సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం ప్రశాంత జీవనశైలిని పొందవచ్చని జిల్లా కలెక్టర్ మహేష్‌కుమార్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. యోగా భారతదేశ వారసత్వ సంపదగా అభివర్ణించారు. ఆధునిక జీవనశైలిలో అనేక రుగ్మతలతో బాధపడుతున్న తరుణంలో యోగా ప్రాణాపాయ సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చ న్నారు. మూడు తరాలకు చెందిన సంతతి ఈ కార్యక్రమంలో పాల్గొనడం గర్వకారణమన్నారు. ఆహ్లాదకరమైన వాతవరణమైన వాడపల్లి పుణ్యక్షేత్రంలో యోగా సాధన చేయడం ఏర్పాట్లు తదితర అంశాలపై నిర్వహకులను అభినందించారు. సాంస్కృతిక ప్రదర్శనలు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, ఆయుష్ వైద్యుల పర్యవేక్షణలో ఓం శాంతి యోగా గురువులు ప్రదర్శన చేయించిన యోగా సనాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా రెవె న్యూ అధికారి బీఎల్.రాజకుమారి, ఆలయ ఉపకమిషనరు నల్లం సూర్యచక్రదరరావు, ఆర్డీవో పి.శ్రీకర్, తహశీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీవో వెంకటరామన్, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.