Indian Railways: మేము ఎలా వెళ్ళాలి సార్!!
ABN , Publish Date - Aug 02 , 2025 | 11:48 AM
కాకినాడ పోర్టు నుంచి విజయవాడకు వెళ్లే ఫాస్ట్ ప్యాసింజర్ రైలులో సరైన టాయిలెట్ సౌకర్యాలు లేకపోవడంతో ప్యాసింజర్లు ఇక్కట్లు పడుతున్నారు. దీనిపై ABN గ్రౌండ్ రిపోర్ట్ చదవండి.

నిడదవోలు, ఆగస్టు 2: ఈ రైలు కోసం ప్రతి రోజూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తారు. అరగంట ఆలస్యమైందంటే ఒకటే టెన్షన్... ఎక్కేవారు. దిగేవారితో నిత్యం రద్దీగానే ఉంటుంది. అయినా ఆ రైలుపై ఎందుకో రైల్వే శాఖకు చిన్న చూపు. సమస్యలు పట్టించుకోరు.. చెప్పినా వినిపించు కోరు.. చేసేది లేక అంత డిమాండ్ ఉన్న రైలులో నిత్యం ముక్కుతూ మూలుగుతూ ప్రయాణం చేస్తున్నవారి సంఖ్య వేలల్లో ఉంటుంది. నిత్యం కాకినాడ పోర్టు నుంచి విజయవాడకు, తిరిగి సాయంత్రం విజయవాడ నుంచి కాకినాడ పోర్టుకు చేరుకుంటుంది. ఈ రైలులో ఉద్యోగులు, ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లేవారు ఎందరో రాకపోకలు సాగిస్తుంటారు.
వేరే ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నవారు అక్కడ పనిచేసే ప్రాంతాల్లో ఇళ్ల అద్దెలు భరించలేక, కుటుంబాలను, ఉన్న ఊరిని మార్చలేక ఇలా ఎన్నోకారణాలతో ఈ పాస్ట్ పాసింజర్ రైలులో ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చేందుకే మక్కువ చూపుతున్నారు. కోవిడ్ కు ముందు 16 బోగీలతో పాస్ట్ ప్యాసింజెర్లు రాకపోకలు సాగించే ఈ రైలులో మూడే టాయ్ లెట్స్ ఉండడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. అవి కూడా అత్యంత దారుణంగా ఉంటున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. రైల్వే శాఖకు ఎంతో ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న ఫాస్ట్ పాసింజర్ రైలులో బోగీలను పెంచి చార్జీలను తగ్గించి పరిశుభ్రతకు ప్రాధాన్యతకు ఇవ్వాలని రైల్వే అధికారులను ప్రయాణికులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి:
టెస్లా ఆటో పైలట్ వైఫల్యం.. 242 మిలియన్ డాలర్‌ల పరిహారం చెల్లించాలంటూ తీర్పు
రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేసిందంటూ వార్తలు.. ట్రంప్ రెస్పాన్స్ ఇదీ