Share News

ఐదింటా జోరు.. రెండింటా పోరు!

ABN , Publish Date - Apr 28 , 2025 | 01:05 AM

జిల్లాలో సంస్థాగత ఎన్నికల జోరు పెరిగిం ది. టీడీపీ ఎమ్మెల్యేలు లేని చోట నేతలపై కూటమి ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

ఐదింటా జోరు.. రెండింటా పోరు!

అనపర్తి, నిడదవోలు వెనుకబాటు

రాజమండ్రి,గోపాలపురంలో నూరు

రెండు నియోజకవర్గాల్లో 70 శాతం

కొవ్వూరులో 54.35 శాతం

అధిష్ఠానం తీరుపై అసంతృప్తి

కూటమి ప్రభావమేనా?

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో సంస్థాగత ఎన్నికల జోరు పెరిగిం ది. టీడీపీ ఎమ్మెల్యేలు లేని చోట నేతలపై కూటమి ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో టీడీపీ సంస్థాగత ఎన్నికలు నీరసంగా ఉన్నా యి. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నుంచి టీడీపీ నేతలకు సరైన గుర్తింపు రాకపోవడమే కారణమనే ప్రచారం సాగుతోంది. గత సార్వ త్రిక ఎన్నికల సమయంలో పొత్త కారణంగా టీడీపీ నేతలు అవకాశాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి సరైన ప్రాధాన్యత ఇస్తామని అప్పట్లో అధిష్ఠానం చెప్పడంతో పాటు పార్టీ విజయానికి సహకరించారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్నా అధిష్ఠానం పట్టించుకోకపోవడంపై కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ రాజానగరం నియోజకవర్గ ఇన్‌చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరికి మాత్రం రుడా చైర్మన్‌ పదవి దక్కింది. నిడదవోలు నుంచి త్యాగం చేసిన బూరుగుపల్లి శేషారావుకు ఏ విధమైన గుర్తింపు లభించలేదు. అనపర్తి సీటు బీజేపీకి కేటాయించినా ఎమ్మెల్యే నల్లమిల్లి రామ కృష్ణారెడ్డి ఉన్నారు. ఆయన కుమారుడు మనో జ్‌రెడ్డి టీడీపీ వ్యవహారాలు చూస్తున్నారు. అధి కారికంగా ఎటువంటి నియామకం జరగలేదు. ఈ నేపథ్యంలో సంస్థాగత ఎన్నికల్లో బాగా వెనుకబడినట్టు సమాచారం.పాత వర్గాలతో పాటు కొత్త వర్గాల నుంచి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు.రాజమహేంద్రవరం నగర టీడీపీ అధ్యక్ష పదవి బీసీ వర్గాలకు దక్కే అవకాశం ఉంది. ఇక్కడ బీసీల నుంచి చాలా మంది ఆశిస్తున్నా రు.మిగతా నియోజకవర్గాల్లో పట్టణ, మండల కమిటీల్లో కొత్తవారు వచ్చే అవకాశాలున్నాయి.

ఏ నియోజకవర్గంలో ఎలా..

ఈనెల 14వ తేదీ నుంచి ఎన్నికల సందడి మొదలైన సంగతి తెలిసిందే.కుటుంబ సాధికార సారధుల పదవులు ఇప్పటికే చాలా చోట్ల పూర్తి చేశారు. రాజమహేంద్రవరం సిటీలో కుటుంబ సాధికార సారథులు(కెఎస్‌ఎస్‌)లు 4237 నియ మించాల్సి ఉంది.ఒక్కో సారధికి ఇద్దరు సభ్యులు ఉంటారు.అంటే 8474 మందిని నియమిం చా ల్సి ఉంది.ఇప్పటికే 8498 మంది నియమించా రు. గోపాలపురంలో మొత్తం 4044 కెఎస్‌ఎస్‌ ఉండగా 8088 మందిని నియమించాల్సి ఉం ది.కానీ 8090 మందిని నియమించి 100.02 శాతం నియామకాలు పూర్తి చేశారు. రాజ మహేంద్రవరం రూరల్‌లో 4481 కెఎస్‌ఎస్‌లకు 7198 మందిని నియమించాల్సి ఉండగా ఇప్పటి వరకూ 5398 మంది నియమించి 74.99 శాతం పూర్తి చేశారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కమిటీలతో పాటు మండల స్థాయి కమి టీని నియమించడానికి సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానున్నట్టు సమాచారం. రాజా నగరంలో టీడీపీ ఎమ్మెల్యే లేనప్పటికీ, అక్కడి ఇన్‌చార్జి బొడ్డు వెంకటరమణ నాయకత్వంలో కమిటీలు జరుగుతున్నాయి. ఇక్కడ 3599 కెఎస్‌ ఎస్‌లకు 7198 మంది సభ్యులను నియమిం చా ల్సి ఉండగా 5398మందిని నియమించి 74.99 శాతానికి చేరుకున్నారు. కొవ్వూరులో 3060 కెఎస్‌ఎస్‌లకు 6120 మంది సభ్యులను నియ మించాల్సి ఉండగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటే శ్వరరావు నాయకత్వంలో 3326 మంది 54.35 శాతం మాత్రమే నియామకాలు పూర్తిచేశారు. నిడదవోలులో 3542 కెస్‌ఎస్‌లకు 7084 మం దిని నియమించాల్సి ఉండగా 2509 మందిని మాత్రమే నియమించారు. ఇది కేవలం 35.42 శాతం.ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు ప్రాధాన్యత ఇవ్వలేదనే ఆగ్రహం పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది. ఇక అనపర్తిలో సంస్థాగత ఎన్నికల సందడే కనిపించడం లేదు. బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తనయుడు, టీడీపీ నేత మనోజ్‌ రెడ్డి టీడీపీ తరపున చు రుగ్గా ఉన్నా కమిటీల నియామకం జీరో అని చెప్పవచ్చు.ఇక్కడ మొత్తం 3767 కెఎస్‌ఎస్‌లకు 7534 మందిని నియమించాల్సి ఉండగా కేవలం 66 మందిని మాత్రమే నియ మించారు. ఇది కేవలం 0.88 శాతమే. ఈ నెల 20వ తేదీకి సారధుల నియామకం పూర్తి కావాల్సి ఉంది.

60 మంది ఓటర్లకు ఒక సారథి

60 మంది ఓటర్లకు ఓ కుటుంబ సాధికార సారధి (కెఎస్‌ఎస్‌) ఉంటారు. ఇందులో ఇద్దరు సభ్యులు ఒకరు మహిళ, ఒకరు పురుషుడు ఉంటారు. తర్వాత బూత్‌ గ్రామ, మండల, పట్టణ, డివిజన్‌, నియోజకవర్గ, పార్లమెంట్‌ పరిధి కమిటీలతో పాటు, వాటి అనుబంధ కమిటీల ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఈనెల 30వతేదీ లోపు క్లస్టర్‌, యూనిట్‌, మండల , పట్టణ, డివిజన్‌ కమిటీలు, అనుబంధ కమిటీల నియామకం కూడా పూర్తి కావాలి. మేనెల 1 నుంచి 7వ తేదీ వరకూ నియోజకవర్గాల అనుబంధ కమిటీల నియామకం జరగాలి. మే నెల 8 నుంచి 15వ తేదీ వరకూ పార్లమెంట్‌ కమిటీలు,అనుబంధ కమిటీలను నియమించా లి.మే నెల చివరలో కడప జిల్లాలో మహా నాడును బ్రహ్మాండంగా నిర్వహించడానికి ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టారు.

Updated Date - Apr 28 , 2025 | 01:05 AM