సన్..డేస్!
ABN , Publish Date - Apr 28 , 2025 | 01:03 AM
ఎండలు మండిపోతున్నాయి. ప్రచండ భానుడు విజృంభిస్తున్నాడు. వేసవి ప్రతాపంతో వివిధ వర్గాల ప్రజలు అల్లాడుతున్నారు.

అల్లాడుతున్న జనం
రాజమహేంద్రవరం సిటీ/పెరవలి/ గోపా లపురం, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): ఎండలు మండిపోతున్నాయి. ప్రచండ భానుడు విజృంభిస్తున్నాడు. వేసవి ప్రతాపంతో వివిధ వర్గాల ప్రజలు అల్లాడుతున్నారు. మధ్యాహ్న సమయంలో రోడ్లమీదకు రావాలంటేనే భయపడుతున్నారు.వ్యవసాయ పనులు ఉదయం పది నుంచి 11 గంటల్లోపే ముగిస్తున్నారు. ప్రజానీకంతో పాటు పశుపక్షాదులు వేసవి తాపానికి అల్లాడుతున్నాయి. పౌలీ్ట్ర ఫారాల్లో కోళ్ళు వేడిమి తట్టుకోలేక మృత్యువాత పడుతున్నట్టు రైతులు వాపోతున్నారు. పాడి పశువుల్లో కూడా పాల దిగుబడి తగ్గిపోతుందని పాడి రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం ఏప్రిల్ నెలల్లో ఎండ తీవ్ర త ఈ విధంగా ఉంటే మే నెలల్లో ఇంకెంతగా ఉంటాయోనని రైతులు వాపోతున్నారు. గత పది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగి భూమి ఉపరితలం వేడెక్కి ఉక్కబోతలు ఎక్కువయ్యాయి. మండుతున్న ఎండలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.ఈ నెల లో అత్యధికంగా 42 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరుకుంది. ఉదయం 8 గంటలకే వెడేక్కి రాత్రి 8 గంటల వరకు ఆ వేడి తగ్గుముఖం పట్టక చిన్నపిల్లలు, వృద్ధులు సతమతమవుతున్నారు. ఏసీలు, కూలర్లు ఉన్నవారు వాటిని 24 గం టలు వినియోగిస్తున్నారు. అధిక వేడి తట్టుకోలేక ప్రజలు గోదావరి స్నానాలకు దిగి సేదతీరుతున్నారు.పుష్కరాలరేవు, ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు చేరుకుని గంటల తరబడి గోదావరిలో స్నానాలు చేస్తూ సేదతీరుతున్నారు. శీతల పానీయాలు, కూల్‌డ్రింక్‌లు అమ్మకాలు పెరి గాయి. సాయంత్రం వేళ రాజమహేంద్రవరం పార్కుల్లో ప్రజలు సేదతీరుతున్నారు.