Share News

రెచ్చిపోతోన్న మట్టి మాఫియా

ABN , Publish Date - Aug 03 , 2025 | 12:21 AM

రాజానగరం మండలంలో మట్టి మాఫియా ఆగడాలు జోరుగా సాగుతున్నాయి. అడ్డుకోవాల్సిన అధికారులు మాఫియా విసిరే కాసులకు కక్కుర్తి పడుతూ కనీసం కన్నెత్తి చూడడం లేదు.

రెచ్చిపోతోన్న మట్టి మాఫియా
అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న లారీలను అడ్డుకున్న కలవచర్ల గ్రామస్తులు

కలవచర్ల గ్రామస్తుల ఆందోళన

రంగంలోకి దిగిన అధికారులు

17 లారీలు..4 ఎక్స్‌కవేటర్లు సీజ్‌

రాజానగరం, ఆగస్టు 2 (ఆంఽధ్రజ్యోతి) : రాజానగరం మండలంలో మట్టి మాఫియా ఆగడాలు జోరుగా సాగుతున్నాయి. అడ్డుకోవాల్సిన అధికారులు మాఫియా విసిరే కాసులకు కక్కుర్తి పడుతూ కనీసం కన్నెత్తి చూడడం లేదు. రాత్రి పగలు తేడా లేకుండా కాలువ గట్లు, చెరువుల్లో ప్రభుత్వ నిబంధనలను కాలరాస్తూ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. రాజానగరం మండలం కలవచర్లలో పోలవరం కాలువ గట్టుపై యఽథేచ్ఛగా అక్రమ మట్టి, గ్రావెల్‌ తవ్వకాలు సాగుతున్నా యి. ఈ మేరకు గ్రామస్తులు శుక్రవారం అర్ధరా త్రి అడ్డుకుని సంఘటనా స్ధలంలో ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో పోలవరం కాలువ గట్టుపై మట్టి లోడుతో ఉన్న 22 లారీలతో పాటు నాలుగు యంత్రాలను పట్టుకుని రెవె న్యూ, పోలీసులు అధికారులకు అప్పగించారు. ఆందోళనకారులు మాట్లాడుతూ గ్రామంలో గత ఆరు నెలలుగా పోలవరం కాలువ గట్టుపై అక్రమ మట్టి, గ్రావెల్‌ తవ్వకాలు చేస్తూ కోట్లాది రూపాయల అక్రమార్జన సాగిస్తున్నారన్నారు. అక్రమ తవ్వకాలపై రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులకు ఆందోళనకారులు శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేయడంతో రాజానగరం తహసీల్దార్‌ జి.అనంతలక్ష్మి సత్యవతి దేవి కలవచర్ల చేరుకున్నారు. అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్న జేసీబీలు, లారీలను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. ఉన్నతాఽఽధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.దీంతో వివిధ శాఖల జిల్లా అధికారులు శనివారం కలవచర్ల చేరుకుని పోలవరం కాలువ గట్లను పరిశీలించారు. మైన్స్‌ శాఖ ఏడీ ఫణిభూషణ్‌ రెడ్డి మాట్లాడుతూ మూడు ప్రదేశాల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరిపినట్టు గుర్తించామన్నారు. అక్ర మ మట్టి రవాణా చేస్తున్న 17 టిప్పర్లను అదు పులోకి తీసుకుని రాజానగరం పోలీసులకు అప్పగించామన్నారు. పోలవరం కాలువ గట్టు వెంబడి మూడు ప్రదేశాల్లో తవ్వకాలు జరుపుతున్న నాలుగు ఎస్కవేటర్లను గుర్తించారు. ఇరి గేషన్‌ సిబ్బంది, మైనింగ్‌శాఖ సర్వేయర్‌ సహాయంతో అక్రమ తవ్వకాలు జరిగిన ప్రదేశాల్లో కొలతలు వేశారు. తనిఖీల్లో జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి డి.ఫణిభూషణ్‌ రెడ్డి, ఇరిగేషన్‌శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ డి.మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2025 | 12:21 AM