రైల్వే ప్రయాణికులకు అభద్రత!
ABN , Publish Date - Aug 03 , 2025 | 12:24 AM
రాజమండ్రి రైల్వే స్టేషను లోపల ఒక వైపు డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా తని ఖీలు చేస్తుండగా.. స్టేషను బయట ఓ మహిళ మెడలో ఆభరణాలు దొంగిలిం చ డానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేశాడు.

ఆభరణాలు దోచుకునే యత్నం
పేలవంగా రక్షణ విధులు
మరో పక్క డీఆర్‌ఎం తనిఖీలు
రాజమహేంద్రవరం,ఆగస్టు 2 (ఆంధ్రజ్యో తి): రాజమండ్రి రైల్వే స్టేషను లోపల ఒక వైపు డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా తని ఖీలు చేస్తుండగా.. స్టేషను బయట ఓ మహిళ మెడలో ఆభరణాలు దొంగిలిం చ డానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేశాడు. పెద్ద రైల్వే స్టేషన్ లోపలా బయటా నేరాలకు అడ్డాగా మారిందని ‘ఆంధ్రజ్యోతి’ శుక్రవారం వెలువరించిన కథనం అక్షర సత్యమని ఈ ఘటన రుజువు చేస్తోంది. రైల్వే స్టేషనులో కోచ్ రెస్టారెంట్ ప్రాంతం, బయట రోడ్డుపై మద్యం పూటుగా తాగిన వ్యక్తులు ప్రమా దకరంగా ప్రవర్తిస్తున్నారు. వారిలో యాచ కులు ఉంటున్నారు. వాళ్లను చూస్తేనే భయ పడే విధంగా ఉంటున్నారు. వారం కిందట కోచ్ రెస్టారెంట్ ఎదురుగా మూతబడిన ఆహారం రెస్టారెంట్‌లో ఒక యాచకుడిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం ఒక రైల్వే మహిళా ఉద్యోగి ఇంటికి వెళు తుండగా.. శ్రీరామ్ హోటల్ పక్కన ధ్వం సమైన షాపుల సమీపంలో పట్టపగలు ఆ ఉద్యోగి వెనుకగా వచ్చిన ఒక వ్యక్తి మెడలో ఆభరణాలు దొంగిలించే ప్రయత్నం చేశాడు. ఆమె అప్రమత్తమై ఆగ్రహించగా అతడు పారిపోయాడు. గూడ్‌షెడ్ ప్రాంతంలో గం జాయి దొరికిన దాఖలాలు ఉన్నాయి. రోజుకు 35 వేల మంది రాకపోకలు సాగించే రాజ మండ్రి రైల్వే స్టేషనులో ప్రయాణికుల భద్ర తను లోపల ప్రభుత్వ రైల్వే పోలీసు (జీ ఆర్పీ), రైల్వే రక్షక దళం(ఆర్పీఎఫ్), బయట టూటౌన్ పోలీసులు చూడాల్సిన బాధ్యత ఉంది.కానీ రక్షణ విధులు పేల వంగా మారి నట్టు పరిస్థితులు చెబుతున్నాయి.టూటౌన్ పోలీసుల నిఘా లేకపోవడం, అప్పుడప్పుడు మాత్రమే పోలీసులు కనబడడంతో ప్రతి రోజూ పూటుగా మద్యం తాగిన వ్యక్తులు ప్రమాదకరంగా మారారు. ప్రయాణికులను భయపెడుతున్నారు.ఇక, రైల్వేస్టేషను బయ ట పరిశుభ్రత నిద్దరోయింది. ప్రయాణికులకు దుర్వాసన స్వాగతం పలుకుతోంది.