ఎంపీహెచ్‌ఏలకు పదోన్నతులు కల్పించాలి
ABN , Publish Date - Apr 28 , 2025 | 12:44 AM
హెల్త్ డిపార్టుమెంట్‌లో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు(ఎంపీహెచ్‌ఏ)గా విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఉద్యోగులకు మల్టీ పర్పస్ హెల్త్ సూపర్‌వైజర్లు(ఎంపీహెచ్‌ఎస్)గా పదోన్నతులు కల్పించాలని ఏపీ ఉమెన్ హెల్త్ డిపార్టుమెంట్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు వీకేఎన్.జయలక్ష్మి కోరారు.

ఏపీ ఉమెన్ హెల్త్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి
రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్ 27(ఆంధ్ర జ్యోతి): హెల్త్ డిపార్టుమెంట్‌లో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు(ఎంపీహెచ్‌ఏ)గా విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఉద్యోగులకు మల్టీ పర్పస్ హెల్త్ సూపర్‌వైజర్లు(ఎంపీహెచ్‌ఎస్)గా పదోన్నతులు కల్పించాలని ఏపీ ఉమెన్ హెల్త్ డిపార్టుమెంట్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు వీకేఎన్.జయలక్ష్మి కోరారు. రాజమహేంద్రవరం లోని ఏపీఎన్‌జీవో హోంలో ఆదివా రం జరిగిన అసోసియేషన్ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. 28 ఏళ్లుగా ఎంపీహెచ్‌ఏలుగా పనిచేస్తున్న వారికి ఎంపీ హెచ్‌ఎస్‌గా అవకాశం ఉన్నా పదోన్నతులు కల్పించడంలేదన్నారు. జోనల్ లిస్ట్ తప్పులతడకగా ఉందన్నారు. దానిని వెంటనే సరిచేసి లిస్టును కమ్యూనికేట్ చేయాలన్నారు. కాకినాడలో డీఎం అండ్‌హెచ్‌వో కార్యాలయం నుంచి లిస్ట్ రాలేదని చెబుతున్న ఉన్నతాధికారులు వెంటనే ఆ లిస్ట్‌ను రప్పించి పదోన్నతులు కల్పించాలన్నారు. 2211 హెడ్‌లో పని చేస్తున్న ఎంపీహెచ్‌ఏలకు ఎఫ్ టీఏలు రావడం లేదని, వెంటనే ఇప్పించాలని, అడిషనల్ హెచ్‌ఆర్‌ఏ ఈ నెల నుంచి జీతం నుంచి కట్ చేస్తున్నారని ఈ దారుణం ఆపి హెచ్‌ఆర్‌ఎను ఇప్పించాలని, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బందికి ఎఫ్‌ఆర్‌ఎస్ తొలగించాలని, హెల్త్ డిపార్టుమెంట్‌లో ఎంపీహెచ్‌ఏలకు ఏపీ పీలు తగ్గించి పనిభారం తగ్గించాలని, పింఛ ను సదుపాయం కల్పించాలని, వార్డు సెకట్రరీల నుంచి ఏఎన్‌ఎంలకు పదోన్నతులు కల్పించి ఎంపీహెచ్‌ఏగా చేయాలని కోరారు. ఈ మేరకు సమావేశంలో తీర్మానాలు చేశారు. సమావేశంలో అసోసియేషన్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షురాలు జె.విజయమ్మ, అధ్యక్షురాలు ఆర్.సూర్యకుమారి, తూర్పుగోదావరి జిల్లా జిల్లా అధ్యక్షురాలు పి.విజయలక్ష్మి, జి.శారద, కోశాధికారి సీహెచ్ సత్యశ్రీ, జి.పద్మకుమారి తదితరులు పాల్గొన్నారు.