మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె
ABN , Publish Date - Apr 28 , 2025 | 12:39 AM
వచ్చే నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సౌత్ సెంట్రల్ జోన్ ఎల్‌ఐసీ ఎంప్లాయీస్ యూనియన్ సంయుక్త కార్యదర్శి కిషోర్‌కుమార్ పిలుపు నిచ్చారు. ఆదివారం స్థానిక మోడల్ కాలనీలోని ఎల్‌ఐసీ ఉద్యోగుల భవన్‌లో రాజమండ్రి డివిజన్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్వర్యంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే 20న జరిగే సార్వత్రిక సమ్మెలో దేశవ్యాప్తంగా సుమారు 10కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని, కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్‌లు, ప్రజా వ్యతిరేక ఆర్థిక నిర్ణయాలకు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు, భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి,తమ నిరసనను తెలియజేయనున్నామని పేర్కొన్నారు.

ఎల్‌ఐసీ ఉద్యోగులు విజయవంతం చేయాలి
యూనియన్ సౌత్ సెంట్రల్ జోన్ సంయుక్త కార్యదర్శి కిషోర్‌కుమార్
రాజమహేంద్రవరం కల్చరల్ ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): వచ్చే నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సౌత్ సెంట్రల్ జోన్ ఎల్‌ఐసీ ఎంప్లాయీస్ యూనియన్ సంయుక్త కార్యదర్శి కిషోర్‌కుమార్ పిలుపు నిచ్చారు. ఆదివారం స్థానిక మోడల్ కాలనీలోని ఎల్‌ఐసీ ఉద్యోగుల భవన్‌లో రాజమండ్రి డివిజన్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్వర్యంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే 20న జరిగే సార్వత్రిక సమ్మెలో దేశవ్యాప్తంగా సుమారు 10కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని, కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్‌లు, ప్రజా వ్యతిరేక ఆర్థిక నిర్ణయాలకు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు, భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి,తమ నిరసనను తెలియజేయనున్నామని పేర్కొన్నారు. ఈ సమ్మెను విజయవంతం చేయాలని ఇన్సూరెన్, బ్యాంకింగ్ తదితర ఆర్థిక సంస్థల ఉద్యోగులతో పాటు ఇతర రంగాల్లో ఉన్న శ్రామిక వర్గమంతా కలిసి ఇచ్చిన సమ్మె పిలుపును విజయవంతం చేయడంలో జీవిత బీమా ఉద్యోగులు ప్రముఖ పాత్ర పోషించాలని కోరారు. సమావేశ ప్రారంభంలో కాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. ఉద్యోగుల ప్రెసిడెంట్ అధ్యక్షుడు ఎస్సార్ మాధ్యూస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాజమండ్రి ఎల్‌ఐసీ ఉద్యోగుల ప్రధాన కార్యదర్శి ఎం.కోదండరామ్, ఎస్.గన్నెయ్య, ఏకే విశ్వనాథ్, రమేష్‌బాబు, ఆర్.శిరీష, కళాధర్, రాజ్యం, ఉమాదేవి, రమణ,సరిత తదితరులు పాల్గొన్నారు.
నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలి
రాజమహేంద్రవరం అర్బన్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నాలుగు లేబర్ కోడ్స్‌ను తక్షణం రద్దు చేయాలని కేంద్ర కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమైన ప్రైవేటీకరణ విధానాలు ఉపసంహరించుకోవాలని, కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని, 8 గంటల పని విధానం అమలు చేయాలని తదితర డిమాండ్లతో మే 20వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించే కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ఈమేరకు ఆదివారం రాజమహేంద్రవరంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో కేంద్ర కార్మిక సంఘాల జిల్లా నాయకుల సమావేశం జరిగింది. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు టి.అరుణ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కె.రాంబాబు, ఐఎఫ్‌టీయూ నాయకుడు జేవీ, ఏఐఎఫ్‌టీయూ నాయకుడు జోజి, ఐఎన్‌టీయూసీ జిల్లా ఇన్‌ఛార్జి జేటీ రామారావు, ఐఎఫ్‌టీయూ నాయకుడు సి.వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కరోనా సమయంలో పార్లమెంట్‌లో ఎలాంటి చర్చ లేకుండా దొడ్డి దారిన నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని అన్నారు. లేబర్ కోడ్స్ ప్రమాదాన్ని వివరించేందుకు జిల్లా స్థాయిలో ఒక సదస్సు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. నాయకులు పవన్, ఎస్‌ఎస్ మూర్తి, పూర్ణిమరాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.