Share News

కలిసిరాని శ్రావణం..

ABN , Publish Date - Aug 03 , 2025 | 12:43 AM

రావులపాలెం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): శ్రావణమాసంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతుల ఆశలు ఆవిరి అయ్యాయి. శ్రావణంలో కూడా కర్పూర రకం అరటికి అ

కలిసిరాని శ్రావణం..
రావులపాలెం అరటి మార్కెట్‌ యార్డులో అమ్మకానికి సిద్ధంగా ఉన్న కర్పూర అరటిగెలలు

నేలచూపులు చూస్తున్న కర్పూర అరటి

గతేడాది కంటే దిగజారిన ధరలు

గెల రూ.100 నుంచి రూ.350లోపే

రైతులు లబోదిబో

రావులపాలెం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): శ్రావణమాసంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతుల ఆశలు ఆవిరి అయ్యాయి. శ్రావణంలో కూడా కర్పూర రకం అరటికి అనుకున్న ధర పలకకపోవడంతో నిరాశ చెందుతున్నారు. అంతర్‌ రాష్ట్ర అరటి మార్కెట్‌ యార్డుగా ఖ్యాతిగాంచిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని రావులపాలెం అరటి మార్కెట్‌ యా ర్డుకు నిత్యం 10 వేల నుంచి 12వేల అరటి గెలల వరకు రైతులు తీసుకొస్తుంటారు. కాగా వీటిలో 6వేల నుంచి 8 వేల గెలల వరకూ కర్పూర రకం అరటే మార్కెట్‌ యార్డుకు వస్తు ంది. ఆషాఢం మాసంలో పెళ్లిళ్లు, శుభ ముహుర్తాలు లేకపోవడంతో ధరలు పెద్దగా పలకలేదు. శ్రావణ మాసం ప్రారంభం నుంచి శుభకార్యాలు పండుగలు పూజలు, పర్వదినాలు ఉండటంతో కర్పూర రకం అరటికి అనుకున్న ధర కంటే అధిక ధర పలుకుతుందని రైతులు ఎదురుచూశారు. ఏదోకొది మేర మాత్రమే పెరగడంతో రైతులు నిరాశ చెందుతున్నారు.

ప్రస్తుతం ఇలా.. గతంలో అలా...

దిగుబడి పెరగడంతో గెలలు కూడా మార్కెట్‌కు పెద్దఎత్తున తరలివస్తున్నాయి. అయితే ప్రస్తుతం కర్పూర రకం అరటి గెల రూ.100 నుంచి రూ.350 వరకూ మాత్రమే పలుకుతుంది. అధిక పెట్టుబడులు పెట్టి ఎన్నో వ్యయప్రయాసలతో సాగు చేసిన పంట చేతికి అందివచ్చిన తరుణంలో అనుకున్న ధర పలకకపోవడంతో అరటి రైతులు ఎంతో ఆవేదన చెందుతున్నారు. గతేడాది శ్రావణ మాసం ప్రారంభంలో కర్పూర రకం అరటిగెల రూ.400 నుంచి రూ.600 వరకు పలికి రైతులు లాభాల బాట పట్టేవిధంగా మార్కెట్‌ సాగింది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితే కనిపించడంలేదని రైతులు దిగాలు చెందుతున్నారు.

Updated Date - Aug 03 , 2025 | 12:43 AM