Share News

లే..ఔట్‌!

ABN , Publish Date - Apr 28 , 2025 | 01:01 AM

2019 ఎన్నికల ముందు అందరికీ ఇళ్లిస్తామంటే పేదలు నమ్మారు.. ఓటేశారు.. గెలిపించారు.. తీరా చూస్తే.. కొండలు.. గుట్టలు.. చివరికి శ్మశానాలు.. అదీ ఇదీ అని ఏముంది.. ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ స్థలాలు ఇచ్చేశారు.. మా పనైందని గత పాలకులు చేతులు దులుపుకున్నారు..

లే..ఔట్‌!

పేదింటి కల తీర్చేలా అడుగులు

ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

లేఅవుట్లపై సర్కారుకు నివేదిక

తూర్పున 59 లేఅవుట్లు రద్దు

కాకినాడ, కోనసీమలో పరిశీలన

కోట్లు ఖర్చు చేసి ఖాళీగా..

పేదలను మోసగించిన జగన్‌

కొత్త స్థలాల ఎంపిక యోచన

పల్లకడియంలో 598 ఎకరాలు

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

2019 ఎన్నికల ముందు అందరికీ ఇళ్లిస్తామంటే పేదలు నమ్మారు.. ఓటేశారు.. గెలిపించారు.. తీరా చూస్తే.. కొండలు.. గుట్టలు.. చివరికి శ్మశానాలు.. అదీ ఇదీ అని ఏముంది.. ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ స్థలాలు ఇచ్చేశారు.. మా పనైందని గత పాలకులు చేతులు దులుపుకున్నారు.. తీరా చూస్తే చాలా లేఅవుట్లలో ఒక్కరూ ఇళ్లు నిర్మించు కోలేదు.. ప్రస్తుతం ప్రభుత్వం ఆ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోకపోవడానికి కారణమేంటనే దానిపై దృష్టిసారించింది.. అనువుగా లేకపోతే రద్దు చేసే యోచనలో ఉంది.. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో 59 లేఅవుట్లు రద్దు చేసినట్టు సమాచారం. గత ప్రభుత్వం పేదలందరినీ మోసం చేసిం ది.. ఎంతో ఆశగా ఇళ్ల స్థలాలకు ఎదురుచూసిన పేదలకు నిరాశనే మిగిల్చింది.. ఇళ్ల స్థలాలకు పనికిరాని భూములను ఎంపిక చేసి పేదింటి ఆశను నీరుగార్చింది. గత ప్రభుత్వం పేదలం దరికీ ఇళ్లిస్తామని చెప్పి నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో హడావిడిగా భూమి సేకరించి.. లే అవుట్లు సిద్ధం చేసింది. తూర్పుగోదావరి జిల్లా లో 526 ప్రాంతాల్లో హడావిడిగా లేఅవుట్లు వేస్తున్నట్టు ప్రకటించి కనీసం చాలా చోట్ల లేఅ వుట్లు వేయలేదు.కొన్ని చోట్ల కాగితాలపై లేఅ వుట్లు చూపించారు. జిల్లా వ్యాప్తంగా 73,282 మంది లబ్ధిదారులకు సెంటు,సెంటున్నర స్థలం వంతున పట్టాలు పంపిణీ చేసిన సంగతి తెలి సిందే.కేవలం భూమిని మాత్రమే సేకరించి లేఅ వుట్‌వేశారు.మౌలిక వసతులు మాటేమరిచారు. దీంతో 26,504 మంది అసలు ఇళ్ల నిర్మాణమే చేపట్టలేదు. ఆ లేఅవుట్లు రద్దు చేయనున్నారు.

అర్బన్‌కు కేరాఫ్‌ పల్లకడియం

ఇక అర్బన్‌ ప్రాంతాల లబ్ధిదారులకు ఎంపిక చేసిన లేఅవుట్లు సరిగ్గాలేవు. బూరుగు పూడి, కాపవరం ఆవ ప్రాంతాల్లో లేఅవుట్ల ప్రతి పాదన వివాదాస్పదనమైన సంగతి తెలి సిందే. దీనిపై కూడా ప్రస్తుత ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇప్పటికే వెలుగుబంద కాలనీలోని ఇళ్లను పూర్తి చేస్తుంది.రాజానగరం మండలం పల్లకడియం, కానవరం ప్రాంతాల్లో 12 లేఅ వుట్లకు 598.72 ఎకరాలు సేకరించారు. ఇక్కడ 22,898 మందికి ఇళ్ల నిర్మాణం చేయనున్నారు.గత ప్రభుత్వం సెంటు వంతున స్థలంతో పట్టాలు ఇచ్చి వది లేసింది.ప్రస్తుత ప్రభుత్వం ఈ స్థలాల్లోనే రెండేసి సెంట్ల వంతున స్థలాలు ఇచ్చి ఇళ్లను నిర్మించడంతో పాటు, మిగిలిన వారికి టిడ్కో ఇళ్లు నిర్మించే యోచనలో ఉంది. బూరుగుపూడి, కాపవరం ప్రాంతాలు ఆవ ప్రాంతంలోని 11, 954 మంది ఎక్కడ ఇవ్వాలనే ఆలోచన చేస్తోం ది.వీరంతా రాజమహేంద్రవరం అర్బన్‌ ప్రాంతా నికి చెందిన లబ్ధిదారులే కావడం గమనార్హం.

తూర్పున రద్దు లేఅవుట్లు ఇవే

నివాస యోగ్యంకాని 59 లేఅవుట్లు ఇలా ఉన్నా యి.కడియం మండలం వేమగిరి-3 ( జడ్పీ స్థలం).కోరుకొండ మండలం నర్సాపురం- కన పూరు రోడ్డు,జగన్నాఽథపురం-1,రంగంపేట మం డలం వడిశలేరు లేఅవుట్‌-2, చండ్రేడు లే అవుట్‌ -1,ముకుందవరం-2,ఈలకొలను, ఈల కొలను-2, నల్లమిల్లి లేఅవుట్‌ -1, వీరంపాలెం-1, దేవరపల్లి మండలం జగన్నాథపురం రోడ్డులో లేఅవుట్‌,బుచ్చియ్యపాలెం, కొండగూడెం హౌ సింగ్‌ బోర్డు,గౌరీపట్నం రజకుల చెరువు, యర్న గూడెం పోలేరమ్మ టెంపుల్‌ లేఅవుట్‌, కృష్ణ పాలెం,ధుమంతునిగూడెం,పల్లంట,కురు కూరు, రాతిగుంటచెరువు లేఅవుట్లు ఉన్నాయి. గోపాల పురం మండలం నందిగూడెం-1, భీమోలు -1 ,వడలకుంట-2,గోపాలపురం- 2,3,4,5, వేళ్లచిం తలగూడెం-1,కరగపాడు-2, నల్లజర్ల మం డలం నబీపేట-2, నల్లజర్ల -4, జగన్నా థపు రం-2, అచ్చన్నపాలెం, సింగరాజుపాలెం-1,2,3 లేఅవు ట్లు.నిడదవోలు మండలం తాడిమళ్ల -2, శెట్టి పేట టిడ్కో,ఎస్సీ పేట రామాలయం దగ్గర లే అవుట్‌.పెరవలి మండలం ఎలిమెంటరీ స్కూల్‌ దగ్గర లేఅవుట్‌, అసైన్డ్‌లాండ్‌ లేఅవుట్‌, పాల ఆది నారాయణ షెడ్‌ దగ్గర లేఅవుట్‌, రవళి స్పిన్నింగ్‌ మిల్లు వెనుక,ఎస్సీ పుంత, పిరమిడ్‌ జ్ఞాన మందిర లేఅవుట్‌, ఉండ్రాజవ రం మండ లం అజ్జరం కాలనీ లేఅవుట్లు ఉన్నాయి.

చంద్రన్న అడుగులు

గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు దేశం నాయకత్వంలోని కూటమి ఘన విజ యం సాధించి సీఎం నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల ముందు గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో లబ్ధిదా రుడికి 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. టిడ్కో ఇళ్లను నిర్మించి ఇచ్చే ఆలోచన చేస్తు న్నారు.అసలైన లబ్ధిదారులు ఎంత మంది? ప్రస్తుతం ఇళ్లు నిర్మించుకున్న వారెందరు? ఆయా ఇళ్లల్లో ఉంటున్న వారెందరో తెలుసుకునే చర్యలు చేపట్టింది. దీంతో అర్హులు, అన ర్హుల జాబితా సిద్ధం చేసింది. ఇప్పటి వరకు కనీసం ఒక ఇటుక కూడా వేయకుండా ఖాళీ గా ఉంచిన స్థలాల లెక్క తేల్చింది. ఆ పట్టాలను రద్దు చేసి,అర్హులైన నిరుపేదలకు కొత్త గా ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది.గత ప్రభుత్వంలా కాకుండా లబ్ధిదారులకు రెండు సెంట్ల భూమి ఇచ్చే ఆలోచన చేస్తోంది.

కాకినాడ జిల్లాలో ఇలా..

(కాకినాడ - ఆంధ్రజ్యోతి)

గత వైసీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన జగనన్న కాలనీలు లబ్ధిదారుల అనాసక్తితో వెలవెలబోతున్నాయి. కాకినాడ జిల్లా పరిధిలో 698 లేఅవుట్లు వేశారు. 87,648 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. 29009 మంది మాత్రమే ఇళ్లు నిర్మించుకున్నారు. వివిధ దశ ల్లో 29020 ఇళ్లు ఉన్నాయి. 29619 ఇళ్లు అయి తే ప్రారంభమేకాలేదు.ఈ లేఅవుట్లకు 681.4 కోట్లు వ్యయం చేశారు.నివాస ప్రాంతాలకు దూరంగా ఉండడం,పల్లపు ప్రాంతాలు కావ డం,పొలాల మధ్య ఉండడం,సముద్రపు ప్రాం తాల్లో ఇవ్వడం వంటి పరిస్థితుల్లో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ఆసక్తి చూపలేదు.

కోనసీమ జిల్లాలో ఇలా..

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలో గత వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన గృహ నిర్మాణాలు మందకొడిగా సాగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో నివాసయోగ్యం కాని స్థలాల్లో లేఅవుట్లను రద్దుచేసి అర్హులకు ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లాలో మొత్తం లేఅవుట్లు 702.. ఇళ్ల లబ్ధిదారులే 43,561 ఉండగా వివిధ దశల్లో ఉన్నవి 14,921,పూర్తయినవి 15,330, ప్రారం భంకానివి 13,310 ఉన్నాయి.. మొత్తం వ్య యం 385.31 కోట్లు వ్యయం చేశారు. ఇంత వరకూ ఇళ్ల నిర్మాణం ప్రారంభించని పట్టాదారుల ఆచూకీపై అధికారులు ఆరా తీసి ప్రభు త్వానికి నివేదిక ఇచ్చినట్టు సమాచారం.

Updated Date - Apr 28 , 2025 | 01:01 AM