ఐదేళ్లలో పింఛన్లకే రూ.1,80,000 కోట్లు
ABN , Publish Date - Aug 02 , 2025 | 01:26 AM
రాష్ట్రం లో ఐదేళ్లలో కేవలం పింఛన్ల కోసమే రూ.1,80,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అనపర్తి మండలం దుప్పలపూడిలోని ఆర్‌వీ ఆర్ కన్వెన్షన్ హాల్‌లో శుక్రవారం ఎన్టీఆర్ స్పౌజ్ పింఛన్లు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రతి నెలా 1వ తేదీన పింఛన్ల పంపిణీ పండగ వాతావరణంలో జరుగుతుందన్నారు.

మంత్రి నిమ్మల రామానాయుడు
అనపర్తి, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రం లో ఐదేళ్లలో కేవలం పింఛన్ల కోసమే రూ.1,80,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అనపర్తి మండలం దుప్పలపూడిలోని ఆర్‌వీ ఆర్ కన్వెన్షన్ హాల్‌లో శుక్రవారం ఎన్టీఆర్ స్పౌజ్ పింఛన్లు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రతి నెలా 1వ తేదీన పింఛన్ల పంపిణీ పండగ వాతావరణంలో జరుగుతుందన్నారు. రాష్ట్రంలో నూతనంగా 1.09 లక్షల మందికి స్పౌజ్ పింఛన్లు మంజూరు చేశామన్నారు. గత ప్రభుత్వం పెన్షన్ల పెంపు విషయంలో పేదలను మోసం చేస్తే కూటమి ప్రభుత్వం ముందు చెప్పిన విధంగానే పెన్షన్ రూ.4 వేలకు పెంచిందని గుర్తు చేశారు. అన్న క్యాం టీన్,తల్లికి వందనం, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పఽథకాలు ఇప్పటికే అమలు చేశామని.. శనివారం అన్నదాన సుఖీభవ పథకం అమలు చేస్తున్నామన్నారు. 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి వస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం చట్టబద్ధంగా ప్రజాస్వామ్య రీతిలో పాలన చేస్తుందని ఎటువంటి కక్ష సాధింపులకు పాల్పడటం లేదన్నారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజలు మరో ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదని తెలుసుకున్న జగన్ ఏమి చేస్తున్నాడో కూడా తెలుసుకోవడం లేదన్నారు. అనంతరం మంత్రి రామనాయుడు చేతుల మీదుగా 600 మంది లభ్ధిదారులకు స్పౌజ్ పింఛన్లు పంపిణీ చేశారు.
ప్రజా సంక్షేమానికి ఎన్టీఆర్ కృషి
ప్రజా సం క్షేమం కోసమే చివరి వరకు పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిరస్మరణీయులని జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శుక్రవారం దుప్పలపూడిలో ఎన్టీఆర్, మూలారెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం రామవరంలోని ఎస్‌వీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మూలారెడ్డి వర్ధంతి సభలో మంత్రి పాల్గొన్నారు. మూలారెడ్డి మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉత్తమ కవి, సాహితీవేత్త బేతవోలు రామబ్రహ్మం, మానసిక వైద్యుడు కర్రి రామారెడ్డిలకు మూలారెడ్డి పేరిట పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, వేగుళ్ళ జోగేశ్వరరావు,యనమల రామకృష్ణుడు,రుడా చైర్మన్ బీవీఆర్ చౌదరి పాల్గొన్నారు.