Share News

రాజమహేంద్రవరంలో అగ్నిప్రమాదం

ABN , Publish Date - Aug 03 , 2025 | 12:46 AM

రాజమహేంద్రవరం, ఆగస్టు 2 (ఆంధ్ర జ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్ర వరంలోని శ్యామలా టాకీస్‌ సమీపంలోని ఒక ఫుట్‌వేర్‌ షాపులో అగ్ని ప్రమాదం సంభవించిం ది. డీఎఫ్‌వో మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాలాజీ అక్వేరియం అండ్‌ పెట్‌, ఫ్యాక్టరీ ఫుట్‌వేర్‌ షాపుల్లో మంట

రాజమహేంద్రవరంలో అగ్నిప్రమాదం
షాపు నుంచి వస్తున్న పొగమంటలు

కాలి బూడిదైన ఫుట్‌వేర్‌ షాపు స్టాకు

రాజమహేంద్రవరం, ఆగస్టు 2 (ఆంధ్ర జ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్ర వరంలోని శ్యామలా టాకీస్‌ సమీపంలోని ఒక ఫుట్‌వేర్‌ షాపులో అగ్ని ప్రమాదం సంభవించిం ది. డీఎఫ్‌వో మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాలాజీ అక్వేరియం అండ్‌ పెట్‌, ఫ్యాక్టరీ ఫుట్‌వేర్‌ షాపుల్లో మంట లు వస్తున్నాయని శనివారం ఉదయం ఫోన్‌ వచ్చిందన్నారు. వెంటనే రాజమండ్రి, కొవ్వూరు నుంచి 3 ఫైరింజన్లను, సిబ్బందిని పంపించా మన్నారు. శుక్రవారం అర్ధరాత్రి విద్యుత్‌ షార్టు సర్య్కూట్‌ వల్ల నిప్పు రాజుకుని ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నామన్నారు. చె ప్పులు, అట్టల వల్ల స్టాకు బూడిదైందని చెప్పా రు. ఫైర్‌ సేఫ్టీ పరికరాలు తప్పనిసరిగా ఉండా లని ఆదేశించామన్నారు. ప్రాణ నష్టం జరగలే దని, ఆస్తి నష్టం అంచనా వేస్తున్నామన్నారు.

అసలేం జరిగింది..!

ఫైరింజన్లు రావడం ఆలస్యం కావడంతో ఫుట్‌వేర్‌ షాపు పక్కనే ఉన్న అక్వేరియం, పెట్‌ షాప్‌కు కూడా మంటలంటుకుని మూగజీ వాలు బలై, ఫుట్‌వేర్‌ షాపులో స్టాకు మొత్తం కాలిపోయిందని తెలుస్తోంది. చెప్పుల దుకాణం నుంచి మంటలు వస్తున్నాయని ఓ వ్యక్తి ఉద యం 6గంటల సమయంలో దగ్గరలో ఉన్న ఇ న్నీసుపేట ఫైర్‌ స్టేషనుకు పరుగులు పెట్టాడు. అయితే అక్కడ ఒక్క ఉద్యోగి మాత్రమే ఉన్నా ను కొవ్వూరు లేదా ఆర్యాపురం నుంచి ఫైరిం జను వస్తుందని చెప్పడంతో అతడు వెనుదిరి గాడు. అరగంట అయినా రాకపోవడంతో మళ్లీ వెళ్లి మరింత బతిమలాడగా, మరో పావుగంట తర్వాత ఫైరింజను ఘటనా ప్రాంతానికి చేరు కుంది. ఈలోపు ఫుట్‌వేర్‌ని అనుకొని ఉన్న షాపులోకి మంటలు వ్యాపించి పక్షులు, కుక్కలు తదితర మూగజీవాలు బూడిదైపోయా యని స్థానికులు చెప్పారు. ఇన్నీసుపేట ఫైర్‌ స్టేషను నుంచి ఘటనా ప్రదేశం సుమారు 500 మీటర్లు మాత్రమే ఉండడం గమానార్హం.

Updated Date - Aug 03 , 2025 | 12:46 AM