రైతు సంక్షేమమే ధ్యేయం
ABN , Publish Date - Aug 03 , 2025 | 01:11 AM
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద శనివారం అన్నదాత సుఖీభవ పథకాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడుతో కలిసి ఆయన ప్రారంభించారు.

అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గోరంట్ల
రైతులకు చెక్కుల పంపిణీ
కడియం, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద శనివారం అన్నదాత సుఖీభవ పథకాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడుతో కలిసి ఆయన ప్రారంభించారు. రైతులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. రైతుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల, వ్యవసాయ సాగు లో విధానాలను పవర్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు వివరించారు. రైతులతో ముఖాముఖి నిర్వహించి రైతులు చెప్పిన సమస్యలపై స్పందిస్తూ అధి కారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశాలిచ్చారు. అన్నదాత సుఖీభవ ద్వారా మొదటి దఫాలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రూ.7 వేలు చొప్పున జమ చేశాయని, ఒక్కో రైతుకు ఏడా దికి రూ.20 వేలు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఈనెల 15 నుంచి స్ర్తీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలిపారు. రైతులతో కలిసి సీఎం చంద్రబాబు చిత్ర పటానికి ధాన్యాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ మోసిగంటి సత్యవతి, ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, మార్గాని సత్యనారాయణ, బోడపాటి గోపి, మత్యేటి ప్రసాద్, ముద్రగడ జమీ, ఆదిమూలం సాయిబాబా, మ ర్రెడ్డి రమేష్, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, నున్న కృష్ణ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
24473 రైతులకు లబ్ధి: నల్లమిల్లి
అనపర్తి, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రామవరంలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రసంగించారు. గత ప్రభుత్వ హయాంలో కనీసం సాగునీరందే పరిస్థితి కూడా లేదని, కూటమి ప్రభు త్వం ఏర్పడిన ఏడాదిలోనే సాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా కాలువలను శుభ్రం చేశామన్నారు. కాగా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల్లో భాగంగా అనపర్తి నియోజకవర్గంలో 24473 రైతులకు రూ.17 కోట్ల లబ్ధి చేకూరిందని అన్నా రు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ చిత్రపటాలకు ధాన్యాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఈస్ట్రన్ డెల్టా ప్రాజెక్టు కమిటీ వైఎస్ చైర్మన్ తమలంపూడి సుధాకరరెడ్డి, మత్స్యశాఖ జేడీ నిర్మల, నియోజకవర్గ ప్రత్యేకాధాకారి ప్రేమ్‌కుమార్, ఏడీఏ కృష్ణ, దత్తుడు శ్రీను, ఆళ్ల గోవిందు, సర్పంచ్‌లు హేమతులసి, గంగాభవాని, కూటమి నాయకులు పాల్గొన్నారు.
26,227 మంది రైతులకు లబ్ధి: బత్తుల
కోరుకొండ, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద ఏర్పా టు చేసిన నియోజకవర్గం స్థాయి కార్యక్రమానికి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమ ణ చౌదరి విచ్చేశారు. ముందుగా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలను ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ సందేశాన్ని, సీఎం చంద్రబాబు సందేశాన్ని లైవ్ టెలికాస్ట్‌ను తెరపై వీక్షించారు. అనంతరం జరిగిన రైతు సదస్సులో మాట్లాడుతూ రెండూ పథకాల కింద నియోజకవర్గంలోని మొదటి విడతగా 26,227 మంది రైతుల ఖాతాల్లో రూ.17,83,010 00 నిధులు జమ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు వారు రాజమహేంద్రవరం ఆర్డీవో కృష్ణనాయక్‌తో కలిసి చెక్‌ను విడుదల చేశారు. కోరుకొండ మండలంలో 8,503 మంది రైతులకు రూ.4.71 కోట్లు, సీతానగరంలో 6328 మందికి రూ.3,42,04000, రాజానగరంలో 8,752 మందికి రూ.4.98 కోట్లు లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు జాజుల రాము, కర్రి లక్ష్మీసరోజ, రొంగల శ్రీనివాస్, నాయకులు అడపా శ్రీనివాస్, అడ్డాల శ్రీనివాస్, బదిరెడ్డి దొర, తెలగంశెట్టి దొర, కంటే నాగ కేశవరావు,అడపా వీరబాబు, తెలగంశెట్టి శ్రీను, బుద్దా బాపూజీ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.