నాడు సహకారం.. నేడు ధిక్కారం
ABN , Publish Date - Apr 29 , 2025 | 12:55 AM
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డీసీసీబీ చైర్మన్ ఎంపిక రసకందాయంలో పడింది. రేపో మాపో టీడీపీ నుంచి నామినేటెడ్ చైర్మన్ పేరు ప్రకటించడానికి అంతా సిద్ధమైందనుకున్న తరు ణంలో చివర్లో జిల్లా పేరే జాబితాలో మాయ మైపోయింది.

డీసీసీబీ చైర్మన్ ఎవరో..
రసవత్తరంగా మారిన ఎంపిక
తాజాగా పది జిల్లాలకు ప్రకటన
ఉమ్మడి జిల్లా చైర్మన్ వాయిదా
నీరుగారిన ఆశావహులు
టీడీపీ,జనసేన మధ్య వార్
తొలుత టీడీపీకే నిర్ణయం
పశ్చిమ జనసేనకు
మారిన పరిణామాలు
పదవుల పంపకం వాయిదా
ఎంపికపై అయోమయం
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డీసీసీబీ చైర్మన్ ఎంపిక రసకందాయంలో పడింది. రేపో మాపో టీడీపీ నుంచి నామినేటెడ్ చైర్మన్ పేరు ప్రకటించడానికి అంతా సిద్ధమైందనుకున్న తరు ణంలో చివర్లో జిల్లా పేరే జాబితాలో మాయ మైపోయింది. రాష్ట్రంలో పది ఉమ్మడి జిల్లాల్లో నామినేటెడ్ డీసీసీబీ చైర్మన్లను సోమవారం ప్రక టించిన ప్రభుత్వం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చైర్మన్ పేరును పక్కన పెట్టేసింది. దీంతో ఈ పదవి ఎవరిని వరిస్తుందనేది ఉత్కంఠగా మారింది. అదే సమయంలో పక్కనే ఉన్న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్ పేరును కూడా వాయిదా వేయడంతో మరింత సస్సెన్స్ నెలకొనేలా చేసింది. ఈ రెండు ఉమ్మడి జిల్లా ల్లో చైర్మన్ కుర్చీ టీడీపీ, జనసేనలో ఎవరు ఏది పంచుకోవాలనేదానిపై ఇరుపార్టీల మధ్య ఏర్ప డ్డ సందిగ్దతే దీని కారణం. వాస్తవానికి ఉమ్మడి పశ్చిమ చైర్మన్ కుర్చీ జనసేన, ఉమ్మడి తూర్పు కుర్చీ టీడీపీ తీసుకోవాలని గతంలో నిర్ణయిం చాయి. చివర్లో పశ్చిమ చైర్మన్ కుర్చీ కచ్చితంగా తమకు ఇవ్వాల్సిందేనని టీడీపీ పట్టుబట్టింది. ఇరుపార్టీల మధ్య నెలకొన్న కుర్చీల పంపకం గందరగోళంతో ఉభయగోదావరి జిల్లాల్లో ఎంపి కను సీఎం వాయిదావేశారు. ఈక్రమంలో ఉ మ్మడి తూర్పుగోదావరి డీసీసీబీ చైర్మన్ కుర్చీలో కూర్చునేది ఎవరినేది ఆసక్తికరంగా మారింది.
ఆశావహులకు నిరాశ..
గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరి షత్ చైర్మన్‌గా పనిచేసిన జ్యోతుల నవీన్ తనకు ఎన్నికల్లో కాకినాడ ఎంపీ టికెట్ ఎలాగూ రానం దున డీసీసీబీ చైర్మన్ కుర్చీ కావాలని అధిష్ఠా నం వద్ద ప్రతిపాదించారు. కాకినాడ రూరల్ ని యోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఉమ్మడి జిల్లాలో పది మంది ఎమ్మెల్యేల నుంచి తన పేరును ప్రతిపా దిస్తూ సిఫార్సు లేఖలు తీసుకున్నారు. పలువు రు మంత్రుల ద్వారా రాయబారం నడిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు చేజారినందున చైర్మన్ కుర్చీ అయినా ఇవ్వాలని ఒత్తిడి తెచ్చా రు. కోనసీమ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత మెట్ల రమణబాబు, కిర్లంపూడికి చెందిన మాజీ జడ్పీటీసీ తోట నవీన్, కాకినాడ రూరల్ టీడీపీ సీనియర్ నేత పిల్లి సత్తిబాబు సైతం పదవి ఆశించారు. తమకు చైర్మన్ పదవి వరిం చడం ఖాయమని ఎవరికివారే లెక్కలేసుకున్న తరుణంలో అనుహ్యంగా సోమవారం ప్రకటిం చిన చైర్మన్ల జాబితాలో ఉమ్మడి జిల్లా పేరు లేక పోవడంతో ఆశావహులంతా కంగుతిన్నారు.
ఏ కుర్చీ ఎవరికో..
జనసేనకు ఇవ్వాలనుకున్న పశ్చిమగోదావరి డీసీసీబీ చైర్మన్ కుర్చీ తమకే కావాలంటూ కొన్ని రోజులుగా అక్కడ టీడీపీ నేతలు పార్టీపై ఒత్తిడి తెస్తున్నారు. తాజా ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ దక్కనివారి నుంచి పదవులు రాని నేతలంతా తమకు చైర్మన్ పదవి ఇవ్వాల్సిందేనని పట్టుబ ట్టారు. జనసేనకు బదులు కుర్చీ టీడీపీకే ఇవ్వా లని చంద్రబాబు, లోకేశ్‌పై ఒత్తిడి తెచ్చారు. పైగా 2014లో ఉంగుటూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గన్ని వీరాంజనేయులు 2019లో ఓడి పోయారు. ప్రస్తుతం ఏలూరు పార్లమెంట్ టీడీ పీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయి తే ఈయనకు పదవి ఇస్తామని పార్టీ ఇది వరకే హామీ ఇచ్చింది. ఆ తర్వాత ఆప్కాబ్ చైర్మన్ పదవి ఇస్తానని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆప్కాబ్ కాకపోయినా డీసీసీబీ కుర్చీ ఇవ్వాల్సిన పరిస్థితి. మరికొందరు సీనియర్లు సైతం తీవ్రం గా పోటీ పడుతున్నారు. ఈనేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ చైర్మన్ టీడీపీ తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అదే జరిగితే ఉమ్మడి తూర్పు కుర్చీని టీడీపీ వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో మళ్లీ టీడీపీ, జనసేన గతంలో నిర్ణయిం చుకున్న జిల్లాల కుర్చీలు మార్చుకోవాల్సి వస్తోం ది. ఈ తలనొప్పులు ప్రస్తుతం తేల్చే పరిస్థితి లేక ఈ రెండు ఉమ్మడి జిల్లాల డీసీసీబీ కుర్చీల చైర్మన్లను సీఎం ప్రకటించకుండా వాయిదా వే శారు. ఉమ్మడి తూర్పు కుర్చీ జనసేనకు విడిచి పెడితే ఇక్కడ టీడీపీ సీనియర్లు, ఆశావహులు మరింత గుర్రుగా మారనున్నారు. ఇప్పటికే కీల క పదవులు జనసేనకు వెళ్లడంతో ఇది కూడా వదిలేసుకుంటే ఎలా అనే నిట్టూర్పులు వ్యక్తం కానున్నాయి. పోనీ జనసేన ఇప్పటివరకు దీనిపై ఆశలు పెట్టుకోకపోవడంతో అసలు అభ్యర్థే లేని పరిస్థితి. ఇదిలా ఉంటే తాజాగా ప్రకటించిన డీసీసీబీ చైర్మన్ పదవులు ఆరు నెలలు మాత్ర మే ఉంటాయి. ఈలోపు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ కుదరకపోతే మరో ఆరునెలల చొప్పున చైర్మన్ పోస్టును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించుకుంటూ వెళ్లవచ్చు.
అంతా సిద్ధమే.. ఈలోగా..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ పాలక వర్గం రద్దయింది. అప్పటివరకు వైసీపీ ప్రభు త్వంలో కొనసాగిన డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజుతో సహా మొత్తం బోర్డు రాజీనామా చేయడంతో గతేడాది జూన్ నుంచి డీసీసీబీ చైర్మన్ కుర్చీ ఖాళీ అయింది. అయితే ఇప్పట్లో డీసీసీబీకి ఎన్నికలు నిర్వహించే వీలులేక తాత్కాలికంగా చైర్మన్ పోస్టును నామినేటెడ్ పద్ధతిలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉండడంతో సీఎం చంద్రబాబు గత కొన్ని నెలలుగా కసర త్తు చేసి టీడీపీ, జనసేన నేతలతో భర్తీ చేశా రు. ఉమ్మడి జిల్లాలో రాష్ట్రస్థాయి పౌర సరఫ రాల సంస్థ చైర్మన్, కాకినాడ నగరాభివృద్ధి సం స్థ చైర్మన్ వంటి పలు కీలక పోస్టులను జన సేనకు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న డీసీసీబీ చైర్మన్ కుర్చీని మాత్రం టీడీపీకి కేటాయించాలని ఎమ్మెల్యేలు, పార్టీ ఆశావహుల నుంచి టీడీపీ అధినేతపై ఒత్తిళ్లు పెరిగాయి. ఉమ్మడి జిల్లాలో అనేక కీలక నామినేటెడ్ పోస్టులు జనసేనకు కట్టబెట్టడంతో డీసీసీబీ టీడీపీకి, డీసీఎంఎస్ జనసేనకు ఇవ్వాలని ప్రతి పాదించారు. అదే సమయంలో డీసీసీబీ చైర్మన్ జనసేనకు, డీసీఎంఎస్ టీడీపీకి ఇవ్వాలని జన సేన నుంచి ఒత్తిడి అధికమైంది. దీంతో ఇరు పార్టీల కీలక నేతల మధ్య కొన్ని నెలల కిందట జరిగిన చర్చల్లో ఉమ్మడి తూర్పుగోదావరి డీసీ సీబీ చైర్మన్ టీడీపీకి, ఉమ్మడి పశ్చిమ డీసీసీబీ చైర్మన్ జనసేన పంచుకునేలా సూత్రప్రా యంగా ఒప్పందం కుదిరింది. ఉమ్మడి తూర్పు చైర్మన్ కుర్చీ టీడీపీకి ఖాయం అనే సంకేతాలు అందడంతో అనేక మంది టీడీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. తమ గాడ్‌ఫాదర్ లను, అనుకూల ఎమ్మెల్యేలను కలిసి తమ పే రు ప్రతిపాదించేలా పావులు కదిపారు. ఎమ్మె ల్యేల నుంచి సిఫార్సు లేఖలు సేకరించారు.