కలెక్టర్ వెళ్లారు.. సమస్యలు విన్నారు..
ABN , Publish Date - Aug 02 , 2025 | 01:29 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదా రులు సక్రమంగా వినియోగించుకోవా లని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. గోకవరం మం డలం గుమ్మళ్ళదొడ్డి గ్రామంలో శుక్రవారం ఆమె పలువురు దివ్యాంగులు, వృద్ధులకు పిం ఛన్లు పంపిణీ చేశారు.

దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందజేస్తానని హామీ
గోకవరం, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదా రులు సక్రమంగా వినియోగించుకోవా లని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. గోకవరం మం డలం గుమ్మళ్ళదొడ్డి గ్రామంలో శుక్రవారం ఆమె పలువురు దివ్యాంగులు, వృద్ధులకు పిం ఛన్లు పంపిణీ చేశారు. సత్యనారాయణస్వామి కొండ వద్ద గల కాలనీలో నివాసం ఉంటున్న ఆడారి వీర వెంకట సత్యనారాయణ, వీరమణి దం పతుల ఇంటికి వెళ్లి వారి కుమార్తెలైన ఆడారి గంగా యమునా సరస్వతి, ఆడారి సాగసాయి అనే దివ్యాంగ బాలికలకు కలెక్టర్ పింఛన్ల సొమ్ము అందజేశారు. అనంతరం ఆ బాలికల యోగక్షేమాలను తల్లి వీరమణిని అడిగి తెలు సుకున్నారు. మేనరికం కారణంగా పెద్ద కు మార్తె గంగాయమునాసరస్వతి (21) పుట్టు కతోనే అంగవైకల్యం బారిన పడిందని తల్లి కన్నీటిపర్యంతమైంది. ఇక రెండో కుమార్తె నాగసాయి (18) 7వ తరగతి చదువుతుండగా పాఠశాలల్లో హఠాత్తుగా కళ్లు తిరిగి అపస్మా రకస్థితికి చేరుకుందన్నారు. 2022 నుంచి పూర్తి గా కాళ్లు చచ్చుబడిపోయాయని కన్నీళ్లు పెట్టు కుంది. దీంతో కలెక్టర్ ఓదార్చారు. దివ్యా ంగు లైన ఇద్దరి బాలికలకు రెండు ట్రై సైకిళ్లు, వాకర్ అందజేస్తానని హామీ ఇచ్చారు.సోమ వారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వాటిని తీసుకెళ్లాలని వారికి సూచించారు. అనంతరం చందం వెంకయ్యమ్మ అనే వృద్ధురాలికి పింఛ ను సొమ్ము అందజేసేందుకు కలెక్టర్ ఆమె ఇంటికి వెళ్లారు. మీరు ఎవరమ్మా అంటూ కలెక్టర్‌ను ఆ వృద్ధురాలు ప్రశ్నించారు. వెంటనే పక్కనే ఉన్న పంచాయతీ కార్యదర్శి రమణ కుమారి కలుగజేసుకొని ఈ మేడమ్ గారు కలె క్టర్ గారంటూ సమాధానం చెప్పారు. పిం ఛను డబ్బులు ఇవ్వడం కోసం ఇక్కడ వరకూ వచ్చారా మీరు చల్లంగ ఉండాలమ్మా అంటూ వృద్ధురాలు వెంకయ్యమ్మ కలెక్టర్‌ను దీవిం చింది.అనంతరం ఆమెతో కలెక్టర్ కాసేపు మా ట్లాడారు. కలెక్టర్ ఇంట్లో నుంచి బయటకు వస్తుండగా ఆ వృద్ధురాలు అనుసరించింది. వెంట రావొద్దని కలెక్టర్ వారించినా వస్తుండ డంతో కలెక్టర్ ఆ వృద్ధురాలు చెయ్యి పట్టుకొని బయట వరకు నడిపించారు. ప్రతి వారం ఒక మండలంలో కలెక్టర్ పర్యటిస్తే బాధితులకు భరోసాగా ఉంటుంది.