Share News

అటెన్షన్‌ ప్లీజ్‌.. డీఆర్‌ఎం సార్‌..

ABN , Publish Date - Aug 02 , 2025 | 01:23 AM

పుష్కరాలు దగ్గరపడుతున్నాయి.. అయినా సమస్యల స్టేషన్లు..ఎప్పటికి పరిష్కరిస్తారో ఏమి టో.. ఏళ్ల తరబడి సమస్యలు వెన్నాడుతున్నా పరిస్థితిలో మాత్రం మార్పులేదు.మరో రెండేళ్ల లో పుష్కరాలు రానున్నాయి. ఇప్పటికైనా రైల్వే అధికారులు దృష్టి సారిస్తే తప్ప పుష్కరాల నాటికి సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉండదు. పుష్కరాల పనుల కోటాలో రైల్వే డీఆర్‌ఎం వస్తున్నట్టు సమాచారం. డీఆర్‌ఎంగా చార్జి తీసుకున్నాక తొలిసారి ఇటు వైపు రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

 అటెన్షన్‌ ప్లీజ్‌.. డీఆర్‌ఎం సార్‌..
రాజమండ్రి రైల్వే స్టేషన్‌

  • ఎవరికీ పట్టని గోదావరి స్టేషన్‌

  • అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా

  • రాజమండ్రి రైల్వే స్టేషన్‌దీ ఇదే పరిస్థితి

  • కొవ్వూరు, నిడదవోలులోను ఇక్కట్లే

  • నేడు రైల్వే డీఆర్‌ఎం రాక

పుష్కరాలు దగ్గరపడుతున్నాయి.. అయినా సమస్యల స్టేషన్లు..ఎప్పటికి పరిష్కరిస్తారో ఏమి టో.. ఏళ్ల తరబడి సమస్యలు వెన్నాడుతున్నా పరిస్థితిలో మాత్రం మార్పులేదు.మరో రెండేళ్ల లో పుష్కరాలు రానున్నాయి. ఇప్పటికైనా రైల్వే అధికారులు దృష్టి సారిస్తే తప్ప పుష్కరాల నాటికి సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉండదు. పుష్కరాల పనుల కోటాలో రైల్వే డీఆర్‌ఎం వస్తున్నట్టు సమాచారం. డీఆర్‌ఎంగా చార్జి తీసుకున్నాక తొలిసారి ఇటు వైపు రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

రాజమహేంద్రవరం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యో తి): రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలు రైల్వే స్టేషన్లలో సమస్యలు తిష్ఠవేసుకుని ఉన్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడు తున్నాయి. అయినా అధికారుల్లో మాత్రం కదలిక ఉండడంలేదు.కేంద్ర ప్రభుత్వం మంజూ రు చేసిన రూ.280 కోట్లతో రాజమహేంద్రవ రంలో చేయాల్సిన రీమోడల్‌ పనులకు ఎప్పుడు కొబ్బరికాయ కొడతారని ప్రయాణికులు ప్రశ్నిస్తు న్నారు. విజయవాడ డివిజన్‌ రైల్వే మే నేజర్‌ మోహిత్‌ సోనాకియా శనివారం పర్యటన నేపథ్యంలో ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

నాలుగు జిల్లాలకు గేట్‌వే వంటి రాజమండ్రి రైల్వే స్టేషన్లో పరిశుభ్రత అంతంత మాత్రంగా ఉండగా, కుక్కలు స్వైర విహారం చేస్తుంటాయి. రాజమండ్రి, గోదావరి రైల్వే స్టేషన్‌ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డంగా మారాయి. గోదావరి స్టేషను ముందూ వెనుకా భద్రతాపరమైన సమ స్యలు ఉన్నాయి. అయినా నేటికీ ఎవరూ దృష్టి పెట్టడం లేదు. అవసరమైనంత పార్కింగ్‌ ప్రదే శం ఉంది. దీంతో ఈ స్టేషన్‌లో పలు ఎక్స్‌ప్రెస్‌ లకు హాల్టు కల్పించాలని జనం కోరుతున్నారు. నిడదవోలు రైల్వే బ్రిడ్జి నిర్మాణం నత్తనడకన సాగుతుండడంతో ఏడాదిగా జనం అవస్థలు అన్నీ ఇన్నీ కావు. నిడదవోలు స్టేషనులో సూపర్‌ ఫాస్టులు ఆగకపోవడంతో ఎంత అభివృద్ధి చేస్తే మాత్రం ఉపయోగం ఏమిటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. స్టేషనులో సదుపాయాల్లేవు. పేరుకు మాత్రమే జంక్షనే అయినా ప్రయా ణికుల్లో ఎప్పుడూ టెన్షనే. ఎఫ్‌సీఐ గోదాముల ద్వారా గూడ్స్‌ రవాణా రూపంలో ఆదాయం భారీగా వస్తున్నా ఈ స్టేషనులో ఇబ్బందులకు పరిష్కారం దొరకడం లేదు.ఇక కొవ్వూరులో చాలా రైళ్ల హాల్ట్‌ లేక 100 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రైలు వచ్చే ముందు డిస్‌ప్లే బోర్డు లు పనిచేయడం లేదు. రైలు వచ్చే ఐదు నిమిషాల ముందు అవి వెలగడంతో ప్రయా ణికులు ఉరుకులు పరు గులు పెడుతు న్నారు. బాత్‌ రూమ్‌లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. పరిశుభ్రత శూన్యంగా మారింది. రైల్వే డీఆర్‌ఎం ఆయా సమస్యలపై దృష్టి సారిం చాలని ప్రయాణికులు కోరుతున్నారు.

  • అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా..పెద్ద రైల్వే స్టేషన్‌

రాజమండ్రి రైల్వే స్టేషనులోని భద్రతా విషయంలో తీవ్ర నిర్లిప్తత కనిపిస్తోంది. ముందస్తు రక్షణను విధికి వదిలేశారు. ప్రయాణికుల భద్రత రైల్వే స్టేషను లోపల ప్రభుత్వ రైల్వే పోలీసు(జీఆర్పీ), రైల్వే రక్షక దళం(ఆర్పీఎఫ్‌) పరిధిలోకి వస్తే.. ప్రాంగణం లో రెండో పట్టణ పోలీసులు చూసుకుంటారు. అయితే ఒకరు చూసుకుంటారని మరొకరు అనుకుంటూ ఉండడంతో ప్రయాణికుల రక్షణ రెండిటికీ చెడ్డ రేవడిలా మారింది. పోలీసులు ఏర్పాటు చేసిన ప్రీపెయిడ్‌ ఆటో బూత్‌ కరోనా విపత్తు సమయం నుంచి సేవలకు దూర మైంది. రైల్‌ కోచ్‌ రెస్టారెంట్‌, మూతబడిన ఐఆర్‌సీటీసీ ఆహారం ఫుడ్‌ ప్లాజాలు అసాం ఘిక వ్యక్తులకు అడ్డాగా మారాయి. రైల్వే స్టేష న్‌లో ఐఆర్‌సీటీసీ ‘ఆహారం’ ఫుడ్‌ ప్లాజా ఆరు నెలల కిందట మూతబడి కంపు కొడుతోంది. పగిలిన అద్దాలు, ఊడిపోయిన స్విచ్‌ బోర్డులు, ధ్వంసమైన సీలింగ్‌.. ఇలా అపరి శుభ్రంగా ఉంది. ఈ ప్లాజా జీ+1 ఫ్లోర్లు ఉండగా.. మొదటి ఫ్లోరులో అసాంఘిక కార్యక లాపాలు జరుగుతున్న ఆనవాళ్లున్నాయి. ఇటీవల ఏలూ రుకు చెందిన రామకృష్ణ అనే యాచకుడిపై పూటుగా మద్యం తాగి ఉన్న ముగ్గురు యువకులు దాడికి పాల్పడ్డారు. ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒకరి వద్ద గంజాయి ప్యాకెట్‌ ఉం దని చెబుతున్నాడు. అంతకు ముందు ఇక్కడే చిన్న పిల్లతో యాచించుకొనే ఒక మహిళను పైఅంతస్తుకు తీసుకెళ్లినట్టు చెబుతున్నారు. దీనికి ఎదురుగా ఉన్న రైలు కోచ్‌ రెస్టారెంట్‌ వెనుక పట్టపగలే మద్యం సేవిస్తున్నారు. కోచ్‌ ప్రస్తుతం మూతబడినా.. దీనిని ఆనుకొని ఉన్న టీస్టాల్‌, రోజ్‌ మిల్క్‌, జ్యూస్‌ దుకాణాలు 24 గంటలూ తెరిచే ఉంటున్నాయి.దీంతో అర్ధరాత్రి వేళ మందు బాబులకు అడ్డాగా మారింది. రైల్వే ప్రాంగణంలో గొడవలు పరి పాటిగా మారిపోయాయి.ఆహారం ఫుడ్‌ ప్లాజా ను ఆనుకొని 1,2,3,4 ప్లాట్‌ఫాంల నుంచి నేరుగా బయటకు వచ్చే మార్గం ఉంది. ఈ క్రమంలో రాత్రి వేళల్లో ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. రైల్వే స్టేషను నుంచి బయటికి వెళ్లే గేటు పక్కన 2017 మార్చి 29న అప్పటి ఎస్పీ బి.రాజకుమారి చొరవతో ప్రీపెయిడ్‌ ఆటో కం ఔట్‌పోస్ట్‌ ఏర్పాటైంది. రాత్రి వేళల్లో ఇది భరోసాగా ఉండేది.కరోనా విపత్తు సమ యంలో మూతబడిన ఈ బూత్‌ మళ్లీ తెరుచుకోలేదు. ఇప్పటికైనా డీఆర్‌ఎం స్పందిం చి సమస్యలు పరిష్కరించాల్సి ఉంది.

  • డీఆర్‌ఎం పర్యటన ఇలా

డీఆర్‌ఎం మోహిత్‌ సోనాకియా ఉదయం 10.30 గం టలకు ప్రత్యేక సెలూన్‌(బోగీ)లో కొవ్వూరు చేరుకుని గంటపాటు పరిశీలిస్తారు. అక్కడి తనిఖీల అనంతరం కొవ్వూరులో పది నిమిషాలు,గోదావరి రైల్వే స్టేషనులో 15 నిమిషాలు, రాజమండ్రిలో 2 గంటలు తనిఖీలు నిర్వహిస్తారు.అనంతరం సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి కాకినాడ వెళతారు.

Updated Date - Aug 02 , 2025 | 01:23 AM