Share News

ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య

ABN , Publish Date - Apr 28 , 2025 | 12:37 AM

పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 16మందిని హతమార్చడం హేయమైన చర్య అని ఆటో ఓనర్స్‌, వర్కర్స్‌ అన్నారు. గుత్తెనదీవి, జి.వేమవరం యూత్‌, మండ పీఎంపీ, ఆర్‌ఎంపీ అసోసియేషన్‌, ఆటో ఓనర్స్‌, వర్కర్స్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమాలు జరిగాయి

ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య

ఐ.పోలవరం, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 16మందిని హతమార్చడం హేయమైన చర్య అని ఆటో ఓనర్స్‌, వర్కర్స్‌ అన్నారు. గుత్తెనదీవి, జి.వేమవరం యూత్‌, మండ పీఎంపీ, ఆర్‌ఎంపీ అసోసియేషన్‌, ఆటో ఓనర్స్‌, వర్కర్స్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమాలు జరిగాయి. జాతీయ జెండాలు పట్టుకుని పాకిస్తాన్‌ నశించాలి..ఉగ్రవాదులను అంతమొందించాలని నినాదాలు చేశారు. ఉగ్రదాడికి కేంద్రం ఘాటుగా బదులివ్వాలని నినదిస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రెళ్ళు గంగాధరం, బొక్కా లక్ష్మీనారాయణ, చోడిశెట్టి రమేష్‌, ఆకుల సత్తిబాబు, సలాది శ్రీనివాసరావు, కంతేటి కుమార్‌, వర్రే రాముడు, వాసంశెట్టి కొండయ్య, సిరంగు వీరన్న, అనిశెట్టి మణికంఠ, పోలిశెట్టి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. మురమళ్ళలో జరిగిన ర్యాలీలో ఆటో ఓనర్స్‌, వర్కర్స్‌ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో వీధి నాగభూషణం, నక్కా రామకృష్ణ, రాయపురెడ్డి వరబాబు, వీధి చిరంజీవి, పలివెల సుబ్బారావు, రాయపురెడ్డి సురేష్‌, ఇళ్ళ నాగేశ్వరరావు, వీధి శేఖర్‌బాబు, మచ్చ నాగబాబు, బత్తిన పైడయ్య పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2025 | 12:37 AM