Amaravati : వైసీపీ నేతల అక్రమాలపై స్పీకర్ లేఖ
ABN , Publish Date - Aug 03 , 2025 | 11:52 AM
అమరావతి: మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు లేఖ రాశారు. గత వైసీపీ ప్రభుత్వంలో విశాఖలో అక్రమంగా భూములు దోచుకున్నారని ఆరోపించారు. విశాఖ భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. మాజీ సైనికుల భూములకు ఎన్‌వోసీల జారీలో అక్రమాలపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఆరోపణలు చేశారు.

విశాఖ భూ అక్రమాలపై ఆరోపిస్తూ .. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేరు ప్రస్తావించడంతో అగ్గి రాజుకుంది. దీంతో భూములపై విచారణ జరపాలని అయ్యన్నపాత్రుడు విచారణకు ఆదేశించారు. మూర్తి ఆరోపణలపై ఎండాడ-2లో భూములకు ఎన్‌వోసీ పక్రియపై విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో విశాఖ భూ ఆక్రమణలపై వీలైనంత తొందరగా సమగ్ర విచారణ జరిపించాలని లేఖలో రాసుకొచ్చారు.
ఈ భూఆక్రమణలపై మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు.ఫ్రీ హోల్డ్ భూముల పేరుతో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని.. రాష్ట్రంలో వీటన్నింటిపై ప్రభుత్వం రీ వెరిఫికేషన్ చేపట్టిందన్నారు. గత సీఎం క్రిమినల్ మైండ్‌తో భూ అక్రమాలు జరిగాయని.. అవన్నీ వెలికి తీస్తామని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఫ్రీ హోల్డ్ పేరిట గత ప్రభుత్వం భూములను దోచుకుందన్నారు సత్యప్రసాద్. అసైన్డ్ భూములు, చుక్కలు భూములపై రీ వెరిఫికేషన్ చేస్తున్నామని తెలిపారు. 22ఏ కింద ఉన్న భూములను 6 లక్షల ఎకరాలును గత ప్రభుత్వం తీసి అమ్ముకుందని వెల్లడించారు. వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు సామాన్య వర్గాల అసైండ్ భూములను బెదిరించి లాక్కున్నారని అనగాని విమర్శించారు.
ఇవీ చదవండి:
వామ్మో.. నడి రోడ్డు మీద ఈ రోబో ఏం చేస్తోందో చూస్తే..
తన సీటులో మహిళ కూర్చుందని.. రెచ్చిపోయి అందరి ముందూ..