సత్యదేవుడి ఖాజానాకు భారీ ఆదాయం
ABN , Publish Date - Aug 03 , 2025 | 12:47 AM
అన్నవరం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధికి విచ్చేసే భక్తులు తమ సెల్‌ఫోన్లను భద్రపరిచేందుకు శనివారం నిర్వహించిన టెండర్ కం బహిరంగ వేలం ద్వారా స్వామివారి ఖజానాకు భారీగా ఆదాయం లభించింది. ఏడా దికి రూ.97.32 లక్షలు చెల్లించేందుకు హెచ్చుపాటకు గు

దేవస్థానంలో సెల్‌ఫోన్లు భద్రపరిచే లైసెన్స్ హక్కుకు బహిరంగ వేలం
రూ.97.32 లక్షలు చెల్లించేందుకు ముందుకొచ్చిన గుత్తేదారు
అన్నవరం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధికి విచ్చేసే భక్తులు తమ సెల్‌ఫోన్లను భద్రపరిచేందుకు శనివారం నిర్వహించిన టెండర్ కం బహిరంగ వేలం ద్వారా స్వామివారి ఖజానాకు భారీగా ఆదాయం లభించింది. ఏడా దికి రూ.97.32 లక్షలు చెల్లించేందుకు హెచ్చుపాటకు గుత్తేదారులు పోటీపడ్డారు. గతంలో ఈ లైసెన్స్ హ క్కుకు రూ.39.72 లక్షలు మాత్రమే హెచ్చుపాట ఖరారయింది. ఒక్కో సెల్‌ఫోన్ భద్రపరిచేందుకు రూ.5 వసూలు చేయాలని టెండర్ షెడ్యూల్‌లో పొందుపరచగా గుత్తేదారు రూ.10 వసూలు చేసేవారు. దీనిపై గతంలో లోకాయుక్తాలో కేసు నమోదు చేయగా జరిమానా విధించారు. సింహాచలం, వాడపల్లి, ద్వారకా తిరుమల దేవస్థానాల్లో టెండర్ షెడ్యూల్ ఆధారంగా రూ.10 వసూలు చేసుకోవచ్చని ఆయా దేవస్థానాలు షెడ్యూల్ జారీచేయడంతో ఈ పర్యాయం అన్నవరం దేవస్థానంలో కూడా ఒక్కోఫోన్‌కు రూ.10 వసూలు చే సుకోవచ్చని పేర్కొనడంతో ఈ ఆదాయం లభించింది.