సత్యదేవుని కల్యాణోత్సవాలకు ఆహ్వానం
ABN , Publish Date - Apr 28 , 2025 | 12:35 AM
అన్నవరం, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): సత్యదేవుడి సన్నిధిలో వచ్చే నెల 8న జరిగే స్వామివారి దివ్యకల్యాణానికి విచ్చేయాలని ఆదివారం దేవదాయమంత్రి ఆనం రాంనారాయణరెడ్డికి ఈవో సుబ్బారావు ఆహ్వానపత్రికను అందజేశా రు. కల్యాణోత్సవాలు వచ్చే నెల 7 నుంచి 13 వరకు జరగనున్నాయి. కల్యాణోత్స

అన్నవరం, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): సత్యదేవుడి సన్నిధిలో వచ్చే నెల 8న జరిగే స్వామివారి దివ్యకల్యాణానికి విచ్చేయాలని ఆదివారం దేవదాయమంత్రి ఆనం రాంనారాయణరెడ్డికి ఈవో సుబ్బారావు ఆహ్వానపత్రికను అందజేశా రు. కల్యాణోత్సవాలు వచ్చే నెల 7 నుంచి 13 వరకు జరగనున్నాయి. కల్యాణోత్సవ ఏర్పాట్లను ఈవో మంత్రికి వివరించగా ఎటువంటి ఇబ్బం దులు రాకుండా నిర్వహించాలని సూచించారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్‌కు ఆహ్వానపత్రికను అందజేయగా.. 2,3రోజుల్లో మిగిలినవారికి అందజేస్తామని దేవస్థానం వర్గాలు తెలిపాయి.
రూ.లక్ష విరాళం
రత్నగిరిపై ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సత్యదేవ నిత్యాన్నదాన పథకానికి ఆదివారం సామర్లకోట మండలం పి.వేమవరానికి చెందిన ఇసరపు మానేశ్వరరావు రూ.లక్ష విరాళంగా స మర్పించారు. ప్రోటోకాల్ అధికారి శొంఠి మూరి ్తకి అందజేయగా ఆయన అభినందించి స్వామివారి ప్రత్యేక దర్శనం, ప్రసాదాలు అందజేశారు.