Share News

మాకు సెలవుల్లేవా తాతయ్యా!

ABN , Publish Date - Apr 29 , 2025 | 01:02 AM

అన్ని స్కూళ్లకు వేసవి సెలవులు ఇచ్చేశారు.. ఒక్క అంగన్‌వాడీలకు తప్ప.. దీంతో మాకెప్పు డిస్తారు తాతయ్యా సెలవులు అంటూ చిన్నా రులు మారం చేస్తున్నారు.

మాకు సెలవుల్లేవా తాతయ్యా!

నేటికీ కొనసాగింపు

పెరుగుతున్న ఎండలు

40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు

చిన్నారుల ఆపసోపాలు

అయినా పట్టని ప్రభుత్వం

నేటికీ విడుదల కాని ప్రకటన

తగ్గుతున్న హాజరుశాతం

సెలవులకు డిమాండ్‌

దివాన్‌చెరువు, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి) : అన్ని స్కూళ్లకు వేసవి సెలవులు ఇచ్చేశారు.. ఒక్క అంగన్‌వాడీలకు తప్ప.. దీంతో మాకెప్పు డిస్తారు తాతయ్యా సెలవులు అంటూ చిన్నా రులు మారం చేస్తున్నారు. పెద్ద పిల్లలకేనా ఎండలు మాకు కాదా అంటూ బోరు బోరు మంటున్నారు. వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు ప్రభుత్వం ఈ నెల 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటించింది. కానీ చిన్నారులు, గర్భి ణులు, బాలింతలకు సేవలందించే అంగన్‌వాడీ కేంద్రాలు యథావిధిగా పనిచేస్తున్నాయి. దీం తో ఈ కేంద్రాలకు వచ్చే చిన్నారులు ఎండతీవ్రత తట్టుకోలేక ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు పూర్వ ప్రాఽథమిక విద్య కోసం 3 నుంచి 6 సంవత్సరాల్లోపు చిన్నారులు వస్తారు. రాజానగరం ఐసీ డీఎస్‌ ప్రాజెక్టుపరిధిలోని రాజానగరం, రాజమహేంద్రవరం ,కడియం మండలాల్లో దాదాపు 300 అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తుండగా రాజానగరం మండలంలో సుమారు 100 అంగన్‌వాడీ కేంద్రాలు 591 మంది బాలింతలు, 530 మంది గర్భిణులతో పాటు మూడు నుంచి ఐదేళ్లులోపు వయసు గల దాదాపు 2270 మంది పిల్లలకు సేవలందిస్తున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలకు ఉదయం హుషారుగా వస్తున్న చిన్నారులు మధ్యాహ్నానికి వాడిపోతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 15వ తేదీ నుంచి అంగన్‌వాడీ కేంద్రాలు ఒంటిపూట పనిచేస్తున్నాయి.ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ కేంద్రం పనివేళలుగా ప్రభుత్వం నిర్ణయించి నిర్వహిస్తోంది. కేంద్రం పనివేళలకు ముందుగానే కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకువెళ్తుండగా , మరి కొంతమంది అసలు తమ పిల్లలను కేంద్రాలకు పంపడంలేదని తెలిసింది. సాధారణంగా అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల అన్నలు, అక్కలు ప్రభుత్వ పాఠశాలల్లోనో, ప్రైవేట్‌ పాఠశాలల్లోనో చదువుతూ ఉంటారు. ఆయా పాఠశాలలకు వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా ఈ నెల 24 నుంచి సెలవులు ప్రకటించారు. దాదాపు 50 రోజుల తర్వాత జూన్‌ 13 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి. సాధారణంగా ఈ సెలవు రోజుల్లో పిల్లలు వారిబంధువుల ఇళ్లకు వెళ్తుంటారు. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ఇవ్వకపోవడంతో చిన్నారులంతా ఇంటి వద్దే ఉండి ప్రతి రోజూ కేంద్రాలకు వస్తున్నారు. మున్మందు వేసవి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. దానిని తట్టుకోలేని చిన్నారులెవరైనా అస్వస్థ తకు గురవుతారేమోనన్న ఆందోళన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నారులకు ఇచ్చే పౌష్టికాహారాన్ని వేసవిసెలవులు సమయంలో టేక్‌ హోమ్‌ రేషన్‌ (టీహెచ్‌ఆర్‌)గా అందజేయవచ్చునని సూచిస్తున్నారు.అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసే వర్కర్లు, సహాయకులకు వేసవి సెలవులు ఇవ్వాలని కోరుతున్నారు.ప్రతి ఏటా మే నెలలో వర్కర్లు, సహాయకులకు చెరో 15 రోజులు వంతున వేసవి సెలవులు ప్రభుత్వం ఇస్తోంది. ప్రభుత్వం స్పందించి అంగన్‌వాడీ కేం ద్రాలకు సెలవులు ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Apr 29 , 2025 | 01:02 AM