Share News

అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి

ABN , Publish Date - Apr 28 , 2025 | 12:35 AM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు.

అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి

అయినవిల్లి, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. ఆదివారం అయినవిల్లిలంక గ్రామంలో జరిగిన అంబేడ్కర్‌ జయంత్యుత్సవంలో ఆయన పాల్గొన్నారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే గిడ్డి మాట్లాడుతూ రాజ్యాంగం వలన అణగారిన వర్గాలకు మేలు జరిగిందన్నారు. అనంతరం పేద, వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, జై భీమ్‌ యూత్‌, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2025 | 12:35 AM