APCPDCL: విద్యుత్తు అంతరాయాలపై డ్రోన్లతో పరిశీలన
ABN , Publish Date - Jun 27 , 2025 | 06:58 AM
విద్యుత్తు అంతరాయాలపై డ్రోన్లతో పరిశీలన చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు

ఏపీసీపీడీసీఎల్‌పై సమీక్షలో సీఎస్ విజయానంద్ ఆదేశాలు
అమరావతి, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు అంతరాయాలపై డ్రోన్లతో పరిశీలన చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు. వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయమైన విద్యుత్తును సరఫరా చేయాలని సూచించారు. ఏపీసీపీడీసీఎల్ పరిధిలో విద్యుత్తు సరఫరాపై గురువారం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. విద్యుత్తు శాఖపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింత పెంచే దిశగా పని చేయాలని, గృహ, పరిశ్రమలకు నిరంతర విద్యుత్తు అందించాలని చెప్పారు.